గతంలో వైసీపీ కీలక నేత, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య కు కారణం టిడిపి అని వైసిపి.. లేదు జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారు అంటూ టీడీపీ విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి వివేకా హత్య పై సిబిఐ విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో మరో క్రీస్తు తెరమీదికి వచ్చింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ వివేకానంద రెడ్డి కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. 

 

 

 తన తండ్రి హత్య కేసులో కొందరిపై అనుమానాలున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు వివేకా కూతురు సునీత. వాచ్మెన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిశ్రీనివాస్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. వైయస్ మనోహర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి. సిఐ శంకరయ్య,  ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మారెడ్డి రవీందర్ రెడ్డి పేర్లను వివేకా కూతురు సునీత కోర్టు కు సంబంధించిన జాబితాలో పేర్కొన్నారు. అయితే వివేక హత్య కేసు మరోసారి తెరపైకి రావడంతో.. వైసీపీ  పార్టీ వైసీపీ పై దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది పచ్చ మీడియా. 

 

 

 అయితే ప్రస్తుతం వివేకా కూతురు సునీత... తన తండ్రి హత్య కేసులో మరోసారి తెర మీదికి తేవడంతో... చంద్రబాబు కు అనుకూలంగా ఉండే మీడియా చానళ్లు అన్ని రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు జగన్ పై ఎప్పుడు బురద జల్లుదామా అని అవకాశం కోసం ఎదురుచూస్తున్న పచ్చ మీడియా ఛానళ్లు... ప్రస్తుతం వివేకా కూతురు సునీత తన తండ్రి హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో ఇదే అదునుగా భావించి... ప్రసాదం దొరికింది అన్నట్టుగా రెచ్చిపోయి మరి అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది చూస్తున్న ఆంధ్ర ప్రజలందరూ... వైఎస్ కుటుంబంపై పచ్చ మీడియా ఇంత ప్రేమ ఒలకబోస్తోంది ఏంటి.? .. బాబోయ్ మరి ఎంత ఘాటు ప్రేమా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: