మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగం పై తీవ్ర దుమారమే లేచింది . ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగాన్ని నిరసిస్తూ  కొన్ని చోట్ల విపక్షాలకు చెందిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు . తాజాగా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లోను ఎక్స్ అఫిషియో  ఓటు వినియోగం వివాదంగా మారింది . దీనితో నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది . రాష్ట్ర వ్యాప్తంగా చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ పదవులకు సోమవారమే ఎన్నికలు నిర్వహించారు .

 

అయితే నేరేడుచర్ల మున్సిపాలిటీ లో మాత్రం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెస్ తరుపున కేవీపీ రామచంద్రరావు ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని అధికార టీఆరెస్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ  మైక్ విరిచేసి నిరసన వ్యక్తం చేశారు . దీనితో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ ఎన్నిక ను అధికారులు వాయిదా వేశారు . నేరేడుచర్ల మున్సిపాలిటీ లో 15 స్థానాలుండగా అధికార టీఆరెస్ , కాంగ్రెస్ చేరి ఏడుస్థానాల్లో విజయం సాధించగా . సిపిఎం ఒక స్థానం లో గెలిచింది . సిపిఎం సభ్యుడు కాంగ్రెస్ కు మద్దతునివ్వాలని నిర్ణయించుకోవం , ఎమ్మెల్యే సైదిరెడ్డి , ఎంపీ ఉత్తమ్ ఇదే మున్సిపాలిటీ లో తమ ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు . చివరి నిమిషం లో కాంగ్రెస్ వ్యూహం మార్చి కేవీపీ ని రంగంలోకి దింపింది .

 

అయితే కేవీపీ కి ఓటు హక్కు కల్పించడాన్ని టీఆరెస్ తీవ్రంగా వ్యతిరేకించడం ఎన్నిక వాయిదాపడగానే , ఆ పార్టీ తమ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ని నేరేడుచర్ల లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది . దీనితో నూతనంగా ప్రకటించిన జాబితా ప్రకారం జరిగిన చైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాజయం తప్పలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: