కాఫీ కాఫీ కాఫీ... ప్రస్తుతం ఇది మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. ఒకరోజు కాఫీ తాగకుండా ఉండాలంటే ఈ రోజు మొత్తం కాస్త చిరాకు గానే ఉంటుంది. కాఫీ లేకుండా ఉదయం మొదలైంది అంటే.. అది చాలా మందికి బ్యాడ్ మార్కింగే.  ముఖ్యంగా ఉదయం పూట కాఫీ తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమంది నిద్ర మత్తులోనే బెడ్ కాఫీ తాగుతూ ఉంటారు. కొంతమంది కాస్త ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగుతూ ఉంటారు. ఏదైతేనేమి కాఫీ తాగడం మాత్రం కామన్. 

 

 

 ఇలా ప్రతిరోజు కాఫీ తాగి తాగి కాఫీ లేకుండా ఒక్క రోజు ఉదయం లేవాలి అన్నా...ఆ ఉదయం ఎంతో బద్ధకంగా మారిపోతుంది. కాఫీ తాగితే చాలు శరీరంలో ఏదో తెలియని ఎనర్జీ ఫాస్  అవుతూ ఉంటుంది. అందుకే కప్పు కాఫీ కోసం ఉదయం పూట పరితపించే వాళ్ళు ఎంతోమంది. ఇక ఉదయాన్నే కాఫీ తాగడం రోజువారి అలవాటుగా మారడంతో... రోజువారి టైం టేబుల్లో కాఫీ ఒక భాగమైపోయింది. ఉదయం పూట తాగి వదిలేస్తారా అంటే అలా  కూడా కాదు పొద్దస్తమానం కాఫీ తాగుతూ ఉండే వాళ్ళు కూడా చాలామంది.అయితే ఉదయాన్నే ప్రతిరోజు కాఫీ తాగడం అలవాటు ఉన్నవారు... ఉదయాన్నే కాఫీ కి బదులుగా ఆపిల్ తీసుకుంటే ఎంతో మేలు అని చెబుతున్నారు వైద్యులు.

 

 

 అయితే ఎంతో మందికి ఉదయం పూట కాఫీ తాగితే ఎంతో రిలీఫ్ దొరుకుతుందని విషయం తెలిసిందే. ఉదయం పూట కాఫీ కి బదులు ఆపిల్ పండ్లు తింటే కాఫీ ఇచ్చిన రిలీఫ్  కంటే ఎక్కువ రిలీఫ్  దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాఫీ మానేసి పొద్దున్నే కాఫీ కి బదులు యాపిల్ తింటే ఎంతో మేలు అని సూచిస్తున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: