తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ భారీ షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 50 రోజులు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ  అనంతరం ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరి అంటూ ఆర్టీసీ భారం రాష్ట్ర ప్రజలపై వేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆర్టీసీ  బస్సుల్లో సామాన్య ప్రజలకు ఆర్టీసీ ప్రయాణం ఎంతో భారంగా మారిపోయింది. ప్రతిరోజు సుదూర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తూ వెళ్లి వచ్చేవారికి భారీగా ఖర్చు అవుతుండడంతో ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు నిత్యవసర వస్తువులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. 

 

 

 ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలందరికీ బారీ  షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు తాజాగా మద్యం ధరలు కూడా పెంచింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు మద్యం ధరలు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు అధికమై  ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల్లో కరెంటు ఛార్జీలు కూడా పెరగనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కరెంటు చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 

 

 దీనిపై ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు... ఓ వైపు ఆర్టీసీ చార్జీల పెంపు.. మరోవైపు మద్యం ధరల పెంపు... ఇప్పుడు కరెంటు చార్జీల పెంపా.. ఇలా అయితే మేము బతికేదెట్లా సారు  అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకపోవడంతో గత మూడేళ్లుగా విద్యుత్ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అందుతున్న నిరంతర విద్యుత్తుతో  ప్రతి యూనిట్కు 35 పైసల చొప్పున విద్యుత్ సంస్థలు నష్ట పోతుండగా... వీటి అప్పుల భారం ప్రస్తుతం 14 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే కరెంటు చార్జీల పెంపు పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: