ఇప్పుడు ఎక్కడ చూడూ ఒక టాపిక్ నడుస్తుంది. అదే కరోనా అనే వ్యాధి.. పిల్లవాడి దగ్గరి నుండి, ముసలి వాడి వరకు అందరు మాట్లాడుకునే ఈ విషయం వినడానికి చిన్నదైనా, పనితనంలో మాత్రం చాలా భయంకరమైనది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇకపోతే చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారట. ఇన్నాళ్లు నిద్రావస్దలో ఉన్న ఈ వైరస్ ఇప్పుడు ఒక్క సారిగా జడలు విప్పుకుని, రాక్షసిలా మారి మనుషుల ప్రాణాలను తీస్తుంది.

 

 

ఇప్పటికే లోకంలో వస్తున్న ఎన్నో రోగాలకు మందులు న్నాయని అనుకుని భ్రమ పడుతున్న ప్రజలకు ఈ కొత్త వ్యాధి కొరకరాని కొయ్యలా మారింది. ఈ దశలో ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కోడానికి పలు దేశాల్లోని వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు. రోగం రావడం దాని వంతు గాని దాన్ని వదిలించు కోవాలంటే మాత్రం ప్రాణాలతో చెలగాటం. ఇంతలా భయ పెడుతున్న ఈ వ్యాధికి అప్పుడే మందు కనిపెట్టానని ఒక వైద్యుడు చెబుతున్నాడు. ఇతని వివరాలు తెలుసుకుంటే.

 

 

చైన్నైలో నివశించే ఓ ఆయుర్వేద వైద్యుడు మాత్రం.. తన దగ్గర కరోనాను నివారించే ఔషదముందని చెప్తున్నాడు. ఈ ఔషదాన్ని తీసుకుంటే కేవలం 24 నుంచి 48 గంటల్లోనే వ్యాధిని నిరోధించవచ్చని భరోసా కూడా ఇస్తున్నాడు. ఇకపోతే చైన్నైలో రత్న సిద్ద అనే ఆస్పత్రిలో ఉన్న డా. ధనికసాలం వేణి డాక్టరు చెవిలో ఈ  కరోనా వైరస్‌ విషయం పడగానే.. దాని లక్షణాలను బట్టి వన మూలికల ద్వారా ఓ విరుగుడు ఔషదం తయారు చేసినట్టు  చెబుతున్నాదట.. ఈ విషయంలో తనతో పాటుగా, తన తోటి డాక్టర్లు కూడా సహకరించినట్టు పేర్కొన్నారు. 

 

 

ఇక ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో పాటు చైనా ప్రభుత్వానికి, తెలియజేయడానికి ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇందుకు గాను త్వరలోనే డా. ధనికసాలం వేణి.. తన టీమ్‌తో కలిసి చైనాలో పర్యటించేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. ఇక ఒకవేళ ఇదే నిజమైతే మన భారతదేశ ఖ్యాతి మరోసారి చరిత్రలో నిలిచిపోతుంది. లేదా ఇది నిజం కాకపోతే పరువు పోతుందని అనుకుంటున్నారట.. ఏది ఏమైన ఈ వార్త నిజం అవ్వాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: