టీడీపీ హయాంలో నరేగా పథకాన్ని సద్వినియోగంచేసుకొని, ఏరాష్ట్రం చేయనివిధంగా   రోడ్లు, భవనాలు, చెత్తనుంచి సంపదతయారీ కేంద్రాలవంటి పనులు చేయడం జరిగిం దని, ఆపనులు చేసినవారికి ఇప్పటికీ నిధులు ఇవ్వకుండా వైసీపీసర్కారు వేధిస్తోందని    ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈవ్యవహారంపై కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కి ఫిర్యాదు చేశామని, ఆయనచెప్పినా వినకుండా, ఆఖరికి హైకోర్టుచెప్పినా ఖాతరుచేయకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 

 

ఈ అంశంపై పార్లమెంట్‌ లో ప్రస్తావించి, రాష్ట్రసర్కారు వైఖరిని ఎండగడతామని రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశా రు. భవనాలు కట్టినవారికి బిల్లులు చెల్లించకుండా, అదేభవనాలకు తమపార్టీ రంగులు వేసుకున్నారని, తద్వారా వందలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలసొమ్ముతో, వారంవారం కోర్టులచుట్టూ తిరుగుతు న్నారని, అదే ఆయన ప్రజలకు ఇచ్చిన గొప్పబహుమానమని కింజారపు వ్యాఖ్యానించా రు. నరేగా నిధులు ఇవ్వమన్నా, రంగులు ఎందుకువేశారన్నా, క్రమంతప్పకుండా కోర్టుకు హాజరవ్వాలని చెప్పినా వినిపించుకోకుండా జగన్‌ ప్రవర్తిస్తున్నాడన్నారు. 

 

వైసీపీ వైఫల్యాలను చూసినతర్వాత రాష్ట్రప్రజలంతా తిరిగి చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటున్నారని రామ్మోహన్‌నాయడు తెలిపారు. జగన్‌ ఎన్ని ఇబ్బందులుపెట్టినా,  టీడీపీ ఎల్లప్పుడూ రాష్ట్రప్రజల భవిష్యత్‌కోసం, వారిపక్షానే నిలిచిపోరాటం చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు. 8నెలల్లోనే వైసీపీప్రభుత్వం సాధించేమీలేదని, అమరావతికోసం రైతులు చనిపోయినా స్పందించకపోవడం విచారకరమని  వాపోయారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా పార్లమెంట్‌సభ్యుల నిధులతో నిర్మించిన భవనాల కు కూడా పార్టీరంగులేశారన్నారు. 


ఎవరు ఎన్ని చెప్పినా సరే జగన్ చేసేది చేసుకుంటూ పోతున్నారు . ఎవరేమనుకున్నా తానూ తీసుకున్న నిర్ణయాలకు తిరుగు లేదని, తన నిర్ణయాలకు ఎదురువచ్చే వ్యక్తులను ఎవ్వరిని కూడా జగన్ వదలడం లేదు.  సంస్థలను  అయన నిషేదిస్తున్నారు.  ప్రజలు, కోర్టులు ఎవరు చెప్పినా ససేమిరా అంటున్నారు.  ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది.   అయినప్పటికీ కూడా జగన్ తన రూటు మార్చకుండా దూసుకుపోతున్నారు.  ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది జగన్ కు తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: