ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులను ఆదుకుంటానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి , అధికారంలోకి వచ్చాక విధివిధానాలు, ఆలోచనలేకుండా ప్రవర్తిస్తున్నాడనిటీడీపీ  నేతలు అంటున్నారు. అమ్మఒడి పథకం కింద కేవలం 43లక్షల మంది విద్యార్థుల్నే అర్హులుగా ప్రకటించారని, గతంలో ఇంటిలో ఎంతమంది చదువుకుంటే, అందరికీ అమ్మఒడి పథకంకింద నిధులిస్తానని చెప్పిన జగన్‌, ఇప్పుడు మాటతప్పాడన్నారు. ప్రతిపనిలో, ప్రభుత్వశాఖలవారీగా జే-ట్యాక్స్‌ వసూలుచేస్తున్న ముఖ్యమంత్రి, వారం పదిరోజులుగా అమ్మఒడి లబ్ధిదారులనుంచి కూడా మామూళ్లు వసూలుచేస్తున్నాడని  దుయ్యబట్టారు. 

 

చేబ్రోలు మండలంలోని ఒకపాఠశాలలో 1436మంది విద్యార్థులుంటే, 70శాతానికిపైగా తల్లిదండ్రులనుంచి రూ. 1000 నుంచి రూ.1500 వరకు వసూలుచేశారన్నారు. విద్యారంగంలో రూ.1630కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం 8కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. పశ్చిమగోదావరిజిల్లాలోని దేవరపల్లిలోని కొత్తగూడెంగ్రామంలో మధ్యాహ్నభోజనంలో బల్లి వచ్చిందని, ఇదేనా జగన్‌ అమలుచేస్తు న్న కొత్తమెనూ అని వారు ఎద్దేవాచేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, మెస్‌ఛార్జీలు పెంచి, శుచి,రుచికరమైన ఆహారాన్ని చంద్రబాబునాయుడు విద్యార్థులకు అందచేస్తే, అది బాగోలేదని చెబుతూ, ముఖ్యమంత్రి దాన్ని మార్చేసి  పిల్లలకు బల్లులు ఆహారంగా పెడుతున్నాడన్నారు. 

 

నాడు-నేడు పేరుతో విద్యార్థుల, పాఠశాలల్లోని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన జగన్‌సర్కారు, తమపార్టీవారికి మేలు చేయడంకోసం, ఆయాలు, స్వీపర్లు, ఇతరకారణాలతో కాజేస్తున్నారని బ్రహ్మంచౌదరి దుయ్యబట్టారు. విద్యార్థులనుంచి, వారి తల్లిదండ్రులనుంచి జే-ట్యాక్స్‌ రూపంలో పాఠశాలలవారీగా వసూలుచేసిన మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆయన స్పష్టంచేశారు. పట్టభద్రుల సమస్యలపరిష్కారంకోసం వారితరుపున ఎమ్మెల్సీలను, ఉపాధ్యాయలు తరుపున ఎమ్మెల్సీలను ఎంపికచేస్తారని, మండలిరద్దుతో ఉపాధ్యాయుల,  పట్టభద్రుల గొంతుక చట్టసభల్లో వినపడకుండా పోయిందన్నారు. 

 

ఉపాధ్యాయుల, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించలేక, ఆయావర్గాలకు సమాధానం చెప్పుకోలేకనే జగన్‌ప్రభుత్వం మండలిరద్దుకి పాల్పడిందన్నారు. జగన్‌ నిర్ణయంపై ఉపాధ్యాయులు, పట్టభద్రులు, యువతీయువకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, సరైనసమయంలో వారంతా ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు.  విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం వారం రోజులకు సంబంధించిన మెనూను ఇటీవలే అసెంబ్లీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: