ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న వాటిల్లో కరోనా వైరస్ ఒకటి.  ఈ వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం విలవిలలాడి పోతున్నది.  వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ వలన ఇప్పటికే వందమందికి పైగా మరణించారు.  దాదాపుగా 2000 మందికి ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది.  వైరస్ ప్రభావం వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఏ మాత్రం తెలియడం లేదు.  


అమెరికన్ సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే, ఈ వైరస్ ప్రభావం వలన ప్రపంచం మొత్తం మీద 6.5 కోట్ల మంది మరణిస్తారని అంటున్నారు.  ప్రపంచంలోని 11 దేశాల్లో దీని ప్రభావం కనిపించబోతున్నది.  ఇకపోతే, ఈ వైరస్ క్రమేణా ఇతర దేశాలకు పాకుతున్నది.  ఇండియాలో కూడా ఇది ప్రవేశించినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే అనేక విమానాశ్రయాల్లో ధర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టారు.  ఈ ధర్మల్ స్క్రీనింగ్ వలన వైరస్ ను కనుగొనే అవకాశం ఉన్నది. 


అయితే, కరోనా వైరస్ నుంచి బయటపడటానికి ఇంకా మందులు ఏవి కూడా  కనుగొన్నట్టుగా కనిపించడం లేదు.  ఇదే ప్రపంచాన్ని ఇబ్బంది  పెడుతున్నది.  ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఏదో ఒక మందు ఉంటుంది.  అయితే, కరోనా వైరస్ నుంచి రక్షించబడేందుకు మాత్రం మందు కనుగొనలేకపోయారు.  కానీ, చెన్నైకు చెందిన తానికసలం వేణి అనే డాక్టర్ కరోనా వైరస్ కు మందు కనుగొన్నట్టు ప్రకటించారు.  సిద్ద వైద్య విధానాల ద్వారా  మూలికల మిశ్రమంతో దీనిని కనిపెట్టినట్టు చెప్తున్నారు.  


ఈ మందుతో డెంగ్యూ, మల్టి ఆర్గాన్ ఫీవర్, తీవ్రమైన లివర్ జ్వరం వంటివి కూడా తగ్గించొచ్చు అని అంటున్నారు.  ఈ మందుతో కరోనా వైరస్ ఆట కట్టించవచ్చు అన్నది తానికసలం వాదన.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే తాను ఆ వైరస్ కు మందును ఉపయోగిస్తానని  అవసరమైతే చైనా వెళ్లి అక్కడ వైరస్ బాధితులకు కూడా ఈ మందును ఇస్తానని అంటున్నాడు.  ఈ మందు ఎంతవరకు నయం చేస్తుందో లేదో తెలియదుగాని, ఈ న్యూస్ మాత్రం వైరల్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: