అన్ని కులాల వర్గాల వారిని సమానంగా చూస్తూ... వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల మహిళలకు చేయూతను అందించేందుకు వైయస్సార్ కాపు నేస్తం పేరుతో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలందరికీ ప్రతి ఏటా 15 వేల చొప్పున ఐదు ఏళ్లలో 75000 అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.కరికాలవలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో వైసిపి ఈ హామీని ఇవ్వకపోయినా... కాపు కులం లో ఉన్న పేద మహిళలను ఆదుకునేందుకు కు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.


 ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్లు, పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ లు ఇంటింటి సర్వే చేసి ఎవరు అర్హులో గుర్తిస్తారు. కుటుంబ పెద్ద ఆధార్ నంబర్లు, ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఆదాయం, బ్యాంకు పుస్తకం, ఆస్తుల వివరాలు ఇలా అన్నింటిని సమగ్రంగా పరిశీలించి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తారు.

 

అర్హులు వీరే

ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాలు నెలకి 10 వేలు , పట్టణ ప్రాంతాల్లో 12 వేల ఆదాయం ఉండాలి.

 కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఈ పథకానికి అనర్హులు. అయితే పారిశుధ్య ఉద్యోగుల కుటుంబంలోని వారిని అర్హులుగా ప్రకటించారు.

 కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.

 40 60 ఏళ్ల లోపు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఓటర్ గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ కార్డు అయినా ఉండాలి. 

పట్టణ ప్రాంతాల్లో 750 చ. అడుగుల్లోపు నిర్మిత భవనం ఉన్నా అర్హులే.

 కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు ఆదాయపన్ను కట్టేవారు అయి ఉండకూడదు.
 
కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: