గ‌ల్ఫ్ దేశ‌మైన దుబాయ్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చిన్నదా పెద్దదా అనేది ఉండదు. కఠినమైన శిక్షలు విధిస్తారు. చాలా కేసుల్లో మరణశిక్షలు విధించిన ఘటనలు ఉన్నాయి. అక్క‌డి చ‌ట్టాలు ఎంత దారుణంగా ఉంటాయంటే..రెండేళ్ల క్రితం 2 మామిడిపండ్లు దొంగలించినందుకు  ఓ భారత కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోర్టు తీవ్రమైన శిక్ష విధించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. అంతేకాదు భారీగా జరిమానా కూడా విధించింది. తాజాగా అలాంటి ఓ విస్మ‌య‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది.  ఓ మహిళను పట్టుకున్న భారతసంతతి వ్యక్తికి దుబాయ్‌లో మూడు నెలల శిక్ష విధించారు. 

 

మాల్‌లో షాపింగ్‌ కోసం 35 ఏళ్ల సిరియా మహిళ తన పిల్లలతో కలిసి వెళ్లింది. సదరు వ్యక్తి షాపింగ్‌ మాల్‌లో ఆ మహిళను తదేకంగా చూస్తూ ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆ మహిళ బిగ్గరగా అరిచింది. దీంతో ఆ వ్యక్తి మహిళ చేతిని పట్టుకున్నాడు. మహిళ కేకలు వినడంతో షాపింగ్‌మాల్‌లో ఉన్నవారంతా అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన అతన్ని అరెస్ట్‌ చేశారు. లైంగికవేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు  ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరుచగా..అతనికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష పూర్తయిన తరువాత అతన్ని దేశం నుంచి పంపించనున్నారు.

 


ఇక మామిడి పండు దొంగ‌త‌నం కేసు విష‌యానికి వ‌స్తే....దుబాయ్ ఎయిర్ పోర్టులో భారత్‌కు చెందిన 27ఏళ్ల వ్యక్తి  పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటైనర్ నుంచి కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కించడం... అక్కడి నుంచి దించడం అతడి డ్యూటీ. 2017 ఆగస్టు 11న ఎయిర్  పోర్టులో డ్యూటీలో ఉండగా ప్రయాణికులకు చెందిన ఓ పండ్ల బాక్స్ నుంచి 2 మామిడిపండ్లు తీసుకున్నాడు. ఇది ఉన్నతాధికారులకు తెలిసింది. వారు దొంగతనం నేరం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో దొంగతనం చేసినట్టు అతడు అంగీకరించాడు. అలా చేయడానికి కారణం కూడా చెప్పాడు. ఆ రోజు తనకు బాగా దాహం వేసిందన్నాడు. నీళ్ల కోసం వెతుకుతుండగా.. పండ్ల బాక్స్ కనిపించిదన్నాడు. వెంటనే అందులోని రెండు పండ్లను తీసుకున్నానని వివరించాడు. అయినా అధికారుల మనసు కరగలేదు. నేరం నేరమే అంటూ అతడిపై కేసు పెట్టారు. 

 

అయితే, ఈకేసును విచారించిన కోర్టు సెప్టెంబర్ 23,2019న తుదితీర్పు ఇచ్చింది. అతడికి 5వేల దిర్హామ్ ల(రూ.96వేలు) ఫైన్ విధించడంతో పాటు దేశ బహిష్కరణ శిక్ష వేసింది. ఆ వ్యక్తి దొంగిలించిన రెండు మామిడి పండ్ల విలువ కేవలం రూ.115. అది దుబాయ్ చ‌ట్టాల ప‌వ‌ర్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: