వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రాజకీయంగా అధినేత జగన్ కు అన్ని విధాలా సహకరిస్తూ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, పార్టీకి మేలు చేసే విధంగా రోజా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత టిడిపి ప్రభుత్వం లో ఆమె వైసీపీ తరఫున నగరి ఎమ్మెల్యే గెలుపొంది అసెంబ్లీలో సైతం అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేసేవారు. రోజా అంటే టిడిపి హడలెత్తిపోయే  పరిస్థితి ఉండేది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించింది. రోజా కూడా నగరి నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రివర్గంలో చోటు ఆమెకు ఖాయం అని అంతా భావించారు. కానీ సామాజిక వర్గ సమీకరణం నేపథ్యంలో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు.


 దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఆమె ప్రాధాన్యతను గుర్తించిన జగన్ ఏపీఐఐసి చైర్ పర్సన్ గా ఆమెకు బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం ఏపీ శాసనమండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా ఎంపికై జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా పని చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పదవులు పోబోతున్నాయి. అలాగే ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఉన్న కొంతమంది మంత్రులు తీరుపై అసంతృప్తిగా ఉన్న జగన్ వారిని తప్పించి వారి స్థానంలో కొత్తగా మరికొందరిని తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోజా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 


ఎట్టిపరిస్థితుల్లోనూ మంత్రి పదవి తనకు రావడం ఖాయం అంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. అయితే సామాజిక లెక్కలు ఖచ్చితంగా పాటించే జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇస్తాడా ? లేక ఇప్పుడు పదవికి రాజీనామా చేయబోయే ఇద్దరు బీసీ మంత్రుల స్థానంలో మళ్ళీ బీసీలకు మంత్రి పదవులు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే రోజా మాత్రం ఎవరికీ వచ్చినా రాకపోయినా తనకు మాత్రం 100% మంత్రి పదవి వచ్చితీరుతుందనే ధీమాలో ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: