ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇప్పుడు మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నట్టు సమాచారం. 
 
ప్రభుత్వానికి జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాకపోవటం, ప్రభుత్వానికి పలు పరిణామాలు ఆందోళనకరంగా మారటం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక వృద్ధి రేటు రోజురోజుకు తగ్గుతూ ఉండటం నేపథ్యంలో ప్రభుత్వం వృద్ధి రేటును పెంచే దిశగా ఎలా ముందడుగు వేయనుందో చూడాల్సి ఉంది. మరోవైపు మరికొన్ని నెలల్లోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 
 
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం తగిన ప్రాధాన్యత ఇచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి. బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ లాభపడే అవకాశం ఉంది. అందువలన బీజేపీ పార్టీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మిగతా రాష్టాలతో పోలిస్తే ప్రయోజనం చేకూరే దిశగా కేంద్రం బడ్జెట్ ను రూపొందించినట్టు సమాచారం. 
 
కేంద్రం బడ్జెట్ లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతో పాటు పన్ను ఆదా లిమిట్ ను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజల కోసం వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితిని కూడా కేంద్రం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయంపై ట్యాక్స్ లిమిట్ కూడా కేంద్రం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ అలా ఉండనుంది...? ఇలా ఉండనుంది...? అని చాలా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ ను ఎలా రూపొందించిందో చూడాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల తాయిలాలు వడ్డించనుందని తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: