జీవితంలో ధనాన్ని కోల్పోయిన వ్యక్తులు చాల కోల్పోయామని బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి వారు పోగొట్టుకున్నది వారి దగ్గర ఉన్న డబ్బును కాదు వారు కోల్పోయింది వారి ఆత్మ విశ్వాసాన్ని. ఒక వ్యక్తి రాణించ లేకపోవడానికి గల కారణం పేదరికం వనరులు లేకపోవడం అని అందరు భావిస్తూ ఉంటారు.

కాని వాస్తవానికి ఆత్మవిశ్వాసం లేకపోవడమే పేదరికానికి కారణం. ఆత్మవిశ్వాసానికి మించిన మరొక సాధనం లేదు. నిరంతరం ఆత్మవిశ్వాసంతో ఉండే వ్యక్తులు ఎలాంటి అద్భుతాన్ని అయినా చేయగలుగుతారు. ఇజ్రాయిల్ దేశం ఒక ఎడారి ప్రాంతం ఆ దేశంలో భూభాగం అంతా ఇసుకతో నిండి ఉంటుంది. నీటి వసతులు కానీ వర్షం కానీ ఆదేశంలో చాల తక్కువగా ఉంటాయి.

అలాంటి పరిస్థితులలో అక్కడి రైతులు మంచును కరిగించి ఆ నీటితోనే వరి ని పండించడమే కాకుండా ఆ దేశం ప్రస్తుతం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించింది అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది అంటే ఆత్మవిశ్వాసం ఒక దేశాన్ని అయినా లేదా ఒక ప్రాంతాన్ని అయినా లేదంటే ఒక వ్యక్తిని అయినా ఎలా ముందుకు నడిపిస్తుందో మనకు అర్ధం అవుతుంది.

వాస్తవానికి వ్యవసాయ దేశంగా పేరు గాంచిన మన భారత దేశంలో ఎన్నో జీవనదులు మరెన్నో వాగులు ఉన్నాయి. మన దేశంలో వర్ష పాతం కూడ చాల బాగుంటుంది. అయితే ఇజ్రాయిల్ దేశంతో పోల్చుకుంటే వ్యవసాయ పంటల దిగుబడిలో మనం ఇజ్రాయిల్ వంటి చిన్న దేశం కంటే వెనకబడి ఉన్నాం. దీనికి కారణం మన దేశ జనాభాలో చాలామందికి ఆత్మవిశ్వాసం లేకపోవడమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నవలా రచయిత మార్క్ ట్వైన్ ‘ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి ప్రాణం లేని మనిషితో సమానం’ అని తన పుస్తకాలలో అనేక సార్లు వ్రాసారు. దీనినిబట్టి ఎవరికైతే పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటుందో వారే విజయాన్ని అందుకుని డబ్బుని సంపాదించి ఐశ్వర్య వంతులుగా మారుతారు అని అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: