''తల్లిపాలు తాగించటం వల్ల చిన్నారి ఆరోగ్యానికి స్వల్పకాలికంగా కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే విషయం అంద‌రికీ తెలిసిందే. కొన్ని ఎలర్జీ ర్యాషెస్, పేగుల్లో సమస్యలు, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలకు తల్లిపాలు పరిష్కారమవుతాయి. కానీ.. తల్లిపాలతో పిల్లలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనే అంశాన్ని బలపరిచే సమాచారం లేదు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, ఊబకాయం, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఏ అధ్యయనమూ చెప్పటం లేదు.

 

అయితే, పిల్లలకు చనుబాలు తాగించటం వల్ల తల్లికి కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందనేది వాస్తవం. అనేక ప్రాంతాల్లో నిర్వహించిన అనేక అధ్యయనాలు.. పిల్లలకు చనుబాలు పట్టే తల్లికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 20 నుంచి 30 శాతం తగ్గుతుందని సూచిస్తున్నాయి'' అని ఎమిలీ వివరించారు.  అలాగే పిల్ల‌ల‌కు రెండేళ్ళ‌కి మించి త‌ల్లి పాలు ప‌ట్టించ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని కూడా చెబుతున్నారు శాస్త్ర‌వేత్త‌లు. దాని వ‌ల్ల వారిలో తెలియ‌ని ఒక పెంకిత‌నం, మొండిగా మార‌డం చేస్తున్నార‌ట‌. 'మీ చిన్నారి, మీరూ ఒకే గదిలో ఉండాలనుకుంటే నిరభ్యంతరంగా ఉండొచ్చు. తొలి రోజుల్లో తల్లీబిడ్డలు ఒకే గదిలో ఉండటం మంచిదని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. కానీ.. ఏడాది పాటు తల్లీబిడ్డలను ఒకే గదిలో ఉంచటం వల్ల స్పష్టమైన ప్రయోజనాలేమీ కనిపించటం లేదు. 

 

పైగా, ఇరువురూ తక్షణమే కాదు, దీర్ఘకాలంలోనూ నిద్రను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది'' అని ఆమె పేర్కొన్నారు. ''పిల్లలు పడుకునే ప్రదేశాలన్నిటిలోకీ, ఒకటి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది: పెద్ద వాళ్లతో కలిసి పిల్లలు కూడా ఒకే సోఫా మీద పడుకోవటం. ఇది సాధారణ రిస్కు కన్నా దీనివల్ల మరణాల రేటు 20 నుంచి 60 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి అలా చేయవద్దు.''

మరింత సమాచారం తెలుసుకోండి: