రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి నుంచీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అంతే కాకుండా. రాష్ట్ర విభజన సందర్భంగా నవ్యాంధ్రకు ఇచ్చిన హామీల్లో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడచినా దీనిపై పురోగతి అంతంత మాత్రమే. స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌ పేర్కొంది.

 

 

దాని ప్రకారం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కూడా నియమించింది. ఆ సమయంలో అక్కడ ఉక్కు పరిశ్రమ ఆర్థికంగా ఉపయుక్తం కాదని ఆ కమిటీ నివేదిక సమర్పించింది. ఇక అప్పటి నుంచి కేంద్రం దీనిపై విముఖత చూపుతోంది. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితులను బట్టి చూస్తే, కేంద్రానికి, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ఇష్టం లేనట్లుగా ఉందని, ఇదిలా ఉండగా, ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమ బాగుపడాలంటే నీరు.. పరిశ్రమలు రావాలని ఆకాంక్షించి, 2019 డిసెంబర్‌లో కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.

 

 

అంతే కాకుండా తమ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పునాది రాయి వేస్తోందని, అందుకు అనుగుణంగా మూడేళ్ళలో నిర్మాణం పూర్తి చేస్తామని ఆసమయంలో జగన్ స్పష్టం చేసారు. ఇక ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా..పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. అయితే ఈ కర్మగారాన్ని వాస్తవంగా కేంద్రమే నిర్మాణం చేయాల్సి ఉందని, కానీ అనుకున్నంతగా ఈ పనులు ముందుకు సాగకపోవడం వల్ల తామే ఏపీఎండీసీ ద్వారా ముందుకొచ్చామని వివరించారు.

 

 

అయితే ప్రస్తుత పరిస్దితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌యంపై కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. విభ‌జ‌న చ‌ట్టంలో ఈ ప్రాజెక్టు ఉన్నా.. పెదవి విప్పని కేంద్రం ఈ విష‌యంలో నిధులు ఇస్తుందా ఇవ్వ‌దా. ఈ బ‌డ్జెట్‌లో దీనికి కేటాయింపులు చేస్తుందా చేయదా అనేది చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: