ఉరుకుల పరుగుల జీవితం... కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా లేదు. డబ్బు సంపాదించడం ముఖ్యం... వ్యాయమం చేద్దామా అంటే... అరే అంత సమయం వ్యాయామానికి కేటాయిస్తే ఎలా అంటుంటారు నేటితరం జనాలు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే అంతవరకు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతం అవుతోనే ఉంటారు . దానికి తోడు పోషక పదార్థాలున్న ఆహారం తినడం కంటే జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకేముంది ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడి పోతున్నాయి. ఇక ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి... సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 

 ముఖ్యంగా రోజువారీ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని కొందరు నిపుణులు సూచించినప్పటికీ వ్యాయామానికి  టైం కూడా లేకపోయింది. అయితే వ్యాయామం చేయాలని ఉన్నప్పటికీ తమకు సమయం సరిపోక రాయమని చేయలేకపోతున్నారు చాలామంది.కానీ ఇకపై మీకు ఆ చింత అక్కర్లేదు. కాఫీ తాగినంత సమయాన్ని వ్యాయామం కోసం కేటాయిస్తే చాలు అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా... సెవెన్ మినిట్ వర్కౌట్ యాప్ లో  సూచించే వర్కౌట్స్ చేసుకోండి.

 

 

 ఇందులో 13 రకాల వ్యాయామ సూత్రాలు ఉన్నాయి . ఒక్కో వ్యాయామ సూత్రానికి పట్టే సమయం కేవలం 30 సెకన్లు మాత్రమే. అంటే మొత్తం పదమూడు వ్యాయామ సూత్రాలకు కలిపి 6:30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇక మిగిలిన 30 సెకన్ల సమయాన్ని ప్రతి వర్కౌట్ కి మధ్య కాస్త విశ్రాంతి కోసం కేటాయించవచ్చు. అంతేకాదు ఈ వ్యాయమ  సూత్రాల్లో మరో సౌలభ్యం కూడా ఉంది. ఇవి సింపుల్ వర్క్ ఔట్స్ కాబట్టి మీ సమయ అనుకూలతను బట్టి రోజుకు రెండు మూడు సార్లు చేసినా మంచిదే. దీంతో ఉదయాన్నే కాసింత వ్యాయామం చేస్తే రోజంతా ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: