గోల్డ్ వ్యాపారిని బెదిరించిన నకిలీ పోలీసులు. గోల్డ్ వ్యాపారిని బెదిరించి డబ్బులు,బైక్,మొబైల్ లాక్కెళ్లిన నకిలీ పోలీసులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు. రెండు గంటలల్లో సిసి కెమెరాల ఆధారంగా కేసును చేదించి నిందితులను పట్టుకున్న పోలీసులు. ఈ ఘటన అర్ధరాత్రి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  వెస్ట్ బెంగాల్ కి చెందిన సమంథ్ వృత్తిరీత్యా బంగారు ఆభరణాలు తయారీ. మంగళవారం రాత్రి సమంథ్ ను  పాత బస్తికి చెందిన ఇద్దరూ పాత నేరస్తులు వసీం,గౌస్ లు పోలీసులమంటూ నిన్ను ఓ కేసు విషయంలో విచారించాల్సింది.బైక్ పై ఎక్కించి మాదన్నపేట్ పరిధిలోని ఆంద్రా బ్యాంక్ వద్ద కల ఏటీఎంకి తీసుకువచ్చారు.

ATM నుంచి 10000 నగదు డ్రా చేయించి,భాదితుణ్ణి బైక్,మొబైల్ తీసుకొని ఉడయించారు. దింతో బాధితుడు కంగుతిన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మాదన్నపేట్ పోలిసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా 2 గంటల లోపు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. మేడ్చల్ మండలము పూడూరు గ్రామంలోని తుపాకుల స్వామి ఇంట్లో దొంగలు పడి 2.15తులాల బంగారం,60వెయిల రూపాయల నగదు దోచుకున్నారని బాధితులు పోలీసులకు తెలియజేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఖాత్తర్, బెహరన్, కువైట్  దేశాలకు తప్పుడు పత్రాలతో  కడప జిల్లా చెందిన.3గురు మహిళాలను పంపు తుండగా మహిళలతో పాటు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పక్కసమాచారం తో  ఇద్దరు ఏజెంట్లు ఖాజా.జబ్బర్ మహిళ లను  అదుపులోకి తీసుకోని దర్యాప్తుచేస్తున్నారు.   ఏయిర్ పోర్ట్ పోలీసులు  దర్యాప్తుచేస్తున్నారు.

దిశ ఘటన జరిగి రెండు మాసాలు కావస్తోంది. ఈ ఘటన తర్వాత పోలీస్‌లు అప్రమత్తమై మహిళల రక్షణ కోసం పలు చర్యలు తీసుకున్నారు..అందులో గస్తీ పెంచటం, రోడ్డు రోమియోల విషయంలో కఠినంగా వ్యవహరించటం.. వీ«ధిలైట్లు ఏర్పాటు చేయటం, జన సమ్మర్ధం లేని దారులను మూసి వేయటం,, ఇంటి వద్దకే వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటం తదితర చర్యలు తీసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: