తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి... ఆ తర్వాత ఫలితాలు కూడా వచ్చాయి... ఇక మొన్నటికి మొన్న కార్పొరేషన్లకు గాను మేయరు ఉప మేయర్ల  ఎన్నిక... మున్సిపాలిటీలకు గాను చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక జరిగింది. అయితే ఈ చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నికలో  చాలామంది పదవి ఆశించి నిరాశ చెందిన వారు ఉన్నారు. ఇక అక్కడ అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైర్మన్ ఎన్నిక జరిగితే  పలు చోట్ల ప్రశాంతంగా ముగిసింది. అయితే చైర్మన్ ఉప చైర్మన్ల ఎన్నిక ముగిసినప్పటికీ... అక్కడ అక్కడ ఇప్పటికీ పలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తన అభిమాన నేతలకు చైర్మన్ ఉప  చైర్మన్ పదవులు దక్కకపోవడంతో... కార్యకర్తలు అభిమానులు ఆందోళన చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. 

 

 

 ఇలాంటి ఘటనే ప్రస్తుతం సూర్యాపేటలో జరిగింది. సూర్యాపేటలో టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు.  గతంలో అన్ని మున్సిపాలిటీల లో చైర్మన్ ఉప  చైర్మన్ జరిగిన రోజునే..  ఇక్కడ కూడా చైర్మన్ ఉప  చైర్మన్ ఎన్నిక జరిగింది. అయితే చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నికల్లో వైస్ చైర్మన్ పదవిని ఆశించారు ఐదవ వార్డు కౌన్సిలర్ భాష. కాగా  వైస్ చైర్మన్ పదవి జనరల్ కు  రావడంతో దళిత మహిళకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు టిఆర్ఎస్ పెద్దలు. దీంతో 5 వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్ పదవిని ఆశించిన భాషకు నిరాశే ఎదురైంది. 

 

 

 ఈ నేపథ్యంలో ఐదవ వార్డు కౌన్సిలర్ భాష అభిమాని అయిన దలవత్ సూరి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంచలనం సృష్టించాడు. తమ అభిమాన నేతకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నాని... టిఆర్ఎస్ ఆఫీస్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన మిగతా నేతలు... అతన్ని  అడ్డుకుని... అతని పై నీళ్ళు పోసారు. దీంతో టిఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ పదవి కాకపోతే మరెన్నో అవకాశాలు ఉన్నాయని...  తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ ఆ యువకుడికి టీఆర్ఎస్ పెద్దలు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: