అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారనే చెప్పొచ్చు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుందామని చేసిన ప్రయత్నం తీవ్రంగా బెడిసికొట్టింది. చివరకు తనకు పట్టున్న మండలే రద్దు అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. అందుకే చివరి రోజు అసెంబ్లీకి హాజరయ్యేందుకు కూడా సాహసం చేయలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఇక ఇప్పుడు అమరావతిలో అభాసుపాలైన చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ నుంచి డ్రామాలు మొదలుపెడతారని వైసీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారన్న మంత్రి కన్నబాబు.. ఈ డ్రామాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి మార్చాలని టీడీపీ ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేయడం సిగ్గు చేటని అన్నారు.

 

బాబూ..నీ డ్రామాలు, కుట్రలు ఇక చాలని, ప్రజలు నవ్వుకుంటున్నారనిమంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పార్లమెంట్‌లో రాజకీయ లబ్ధి కోసం తప్ప.. వేరే విషయాలపై మాట్లాడలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రజల నుంచి వచ్చిన చర్చను ఒక ప్రామాణికంగా తీసుకొని సీఎం వైయస్‌ జగన్‌ కమిటీలు వేసి వికేంద్రీకరణ జరగాలని ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు.

 

ఇంకా కన్నబాబు ఏమన్నారంటే.. “ చేసిందంతా చేసి మళ్లీ ఢిల్లీలో డ్రామాలు ఆడాలని మీ ఎంపీలకు హితభోద చేస్తారా?. ఢిల్లీలో కాదు..ఎక్కడ డ్రామాలు చేసినా ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టడం ఖాయం. ఎవరి పట్ల టీడీపీకి కమిట్‌మెంట్‌ లేదు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు.

 

 

ఇలాంటి కృత్రిమ పోరాటాలను రాజకీయ అవసరాల కోసమే. ఇలా ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు. ఇప్పటికైనా సరే కొంచమైనా రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచన చేయాలి. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని మంత్రి కన్నబాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: