ఇప్పటివరకు అందరూ రైలు ప్రయాణాలు చేసే ఉంటారు... సాదాసీదా రైలు పట్టాలపై ప్రయాణం చేసిన వారు కొందరైతే పెద్ద పెద్ద బ్రిడ్జి పై ప్రయాణం చేసిన వారు ఇంకొందరు. ఇలాంటి రైలు ప్రయాణాలు ప్రస్తుతం మన దేశంలో మామూలే. కానీ ఇప్పటివరకు ఎవరు నీటిలో రైలు ప్రయాణం చేసి ఉండరు. కేవలం అక్కడక్కడా చూసుకుంటారు అంతే. కానీ కొన్ని రోజుల్లో మన దేశంలో కూడా నీటిలో రైలు ప్రయాణం చేయవచ్చు. కోల్కతాలోని హుబ్లీ నదిని దాటుతూ... పరుగులు పెట్టే తొలి అండర్ వాటర్ మెట్రో ఈస్ట్ వెస్ట్ ప్రాజెక్టును కోల్కత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. 

 

 

 ఈ ప్రతిష్టాత్మకమైన అండర్వాటర్ మెట్రో ఈస్ట్ వెస్ట్  ప్రాజెక్టును 1984 లోనే చేపట్టిన భారత్.. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో సవాళ్లు ఎన్నో అవాంతరాలను.. ఎన్నో అంచనాలను... ఇంకెంతో వ్యయాన్ని అధికమించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టు 2022 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా భారత రైల్వే బోర్డు నుంచి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టిన మెట్రో రైలు అథారిటీకి చివరి వాయిదా కింద 20 కోట్ల రూపాయలు అందనున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మెట్రో పనులు చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

 

 

 ఇక అండర్ వాటర్ మెట్రో ఈస్ట్ వెస్ట్ ప్రాజెక్టును దాదాపు 10 వేల కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుకి 49 శాతం మేరకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. అండర్ వాటర్ మెట్రో ఈస్ట్ వెస్ట్  ప్రాజెక్టు ద్వారా... రోజుకు తొమ్మిది లక్షల మంది... అంటే నగర జనాభాలో 20 శాతం మంది అండర్ వాటర్ మెట్రో రైలు ద్వారా ప్రయాణం చేయవచ్చు.520 మీటర్ల అండర్వాటర్ ను ఈ  హైస్పీడ్ మెట్రో రైలు కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే దాటుతుందని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: