చైనాలో పుట్టిన కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం గడగడా వణికిస్తోన్నది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ ప్రమాదకర వైరస్ బారినపడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో ఎక్కడి నుంచి ఈ వైరస్ దాడి చేస్తుందోనని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో కరోణ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చైనా దేశానికి వెళ్లి వచ్చే వారి సంఖ్య కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఇక చైనా నుంచి తమ తమ దేశాలకు ఎవరూ రాకుండా చూసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వస్తే ఎయిర్పోర్టులోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయినప్పటికీ ఈ మహమ్మారి వాది శరవేగంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హైఅలర్ట్ కూడా ప్రకటించింది. 

 

 

 అయితే చైనా లోని  ఎంతోమంది భారతీయులను  కూడా.. కొన్ని రోజుల వరకు భారతదేశానికి అనుమతించబోమని ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. ఇక మొన్నటికి మొన్న చైనా నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకిందని  అనుమానించిన వైద్యులు వారికి ఒక ప్రత్యేక వార్డును కేటాయించి మరి చికిత్స అందించారు. ఇక ఆ తర్వాత ఆ నలుగురు వ్యక్తులకు కరోణ వైరస్  లేదని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఇకపోతే ఇప్పటికే కరోనా వైరస్ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయాయి. కరోణ వైరస్ ఎప్పుడు ఎటు నుంచి వ్యాప్తి చెందుతుందో తెలియదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. 

 

 

 ఇకపోతే నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సహా.. కరోణ వైరస్ వల్ల జరిగే పరిణామాలు... కరుణ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకొనే జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించనున్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇకపోతే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా  వైరస్ కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉంది. ఈ రోజు కేంద్ర బృందం హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది . కరానాపై  ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో నేడు కేంద్ర బృందం సభ్యులు గాంధీ ఆస్పత్రిని సందర్శించి పలు వివరాలను తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: