పరిపాలనా పరంగా  జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేకపోయిన తండ్రీ, కొడుకులు వ్యక్తిత్వంపై విషం చిమ్మటం మొదలుపెట్టారు.  మొదటి చంద్రబాబునాయుడు మొదలుపెడితే వెంటనే చినబాబు లోకేష్ కంటిన్యు చేస్తున్నారు.  ఇంతకీ  చంద్రబాబు చిమ్మిన విషం ఏమిటయ్యా అంటే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను జగన్ కొట్టారట. ఎందుకు కొట్టాడు ? ఎప్పుడు కొట్టాడు ? సాక్ష్యం ఏమన్నా ఉందా ? అంటే వాటికి మళ్ళీ చంద్రబాబు నుండి సమాధానం లేదు.

 

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో చెప్పుకుని జగన్ తల్లి విజయమ్మ తెగ బాధిపడిపోయిందట.  రోశయ్యతోనే  విజయమ్మ ఎందుకు చెప్పుకున్నది ? అంటే మళ్ళీ చంద్రబాబు నోరు లేవటం లేదు. రోశయ్యతో విజయమ్మ చెప్పిన విషయం చంద్రబాబుకు ఎవరు చెప్పారంటే సమాధానం చెప్పటం లేదు. అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఏదో పనికిమాలిన మాటలు పట్టుకుని మీడియా సమావేశంలో చెప్పటాన్ని ఏమంటారు ?

 

ఇక చినబాబు విషయం చూస్తే మరో ఎత్తు. జగన్ ను సిఎం చేసేందుకే చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని లోకేష్ బాబు జనాలను నమ్మించేందుకు నానా అవస్తలు పడుతున్నారు. జగన్ సిఎం అవ్వటానికి బాబాయ్ వివేక  హత్యకు ఏమిటి సంబంధం ?  వివేకానందరెడ్డి హత్య అయితే  జగన్ సిఎం ఎలా అవుతారో  చినబాబే చెప్పాలి.  వివేకా ఏమీ రాష్ట్రస్ధాయిలో ఇమేజున్న  తిరుగులేని  నేతేమీ కాదు.  కాకపోతే వైఎస్పార్ సోదరుడు కాబట్టి వివేకానంద రెడ్డి అంటే అందరికీ పరిచటం ఉన్న నేత మాత్రమే.

 

చంద్రబాబు, చినబాబు విషంచిమ్మటానికి ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు కనబడుతున్నాయి. మొదటిది మూడు రాజధానుల అంశం. ఇక రెండోది శాసనమండలి రద్దు తీర్మానం.  ఈ రెండింటి దెబ్బ తండ్రి, కొడుకుల మానసిక పరిస్ధితి మీద బాగానే ప్రభావం చూపుతున్నట్లుంది. ఆ కక్షతోనే ఇద్దరూ నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఏం మాట్లాడుతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: