కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ నేటి మనుషులు మాత్రం విడిగా ఉంటే దక్కును సుఖం అని నిరూపిస్తున్నారు. కాని ఎన్ని కష్టాలు ఏదుర్కొంటున్నారో అర్ధం చేసుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్ద దూరం అయిన తర్వాత ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవడం. పొరబాట్లు జరిగితే ప్రాణాలు తీసుకోవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఎక్కడైనా ఒక వ్యక్తి ప్రాణాపాయ స్దితిలో ఉంటే మనకేంటి అని పట్టించుకోకుండా బ్రతుకుతున్న సమాజంలో ఉంటున్న ఈ మనుషులు అప్పుడప్పుడు మాత్రం చలిస్తారు. లోపల కౄరత్వం ఎంతున్న దాన్ని కప్పి పెట్టి ఐకమత్యాన్ని చాటుతారు.

 

 

ఇకపోతే వేయి ఏనుగుల బలం ఉన్న దాన్ని కూడా గడ్దిపోచలతో బందించినట్లుగా, ఎంత బరువైన వస్తువుగాని. ఐకమత్యం అనే ఆయుధంతో అక్కడి నుండి అవలీలగా తప్పించవచ్చూ.  అందుకు ఉదాహరణ ఇక్కడ మనం చూడబోతున్న వీడియోనే.. ఒక్కరు చేయలేని పని పదిమంది కలిసి చేస్తే ఎంత ఈజీగా పూర్తవుతుందో అర్ధం అవుతుంది. ఈ సంఘటనను జీవితానికి అన్వయించుకుంటే, ఈ రోజుల్లో స్వార్ధం పెరిగిపోయి ఎవరికి వారే జీవిస్తున్న మనుషుల్లో, ఇలాంటివి చూసినప్పుడైన ఆలోచన కలగడం లేదు. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం.. ఇకపోతే ఇక్కడ జరిగిన ప్రమాదంలో మనకేంటని ఎవరి దారిన వారు వెళ్లకుండా అక్కడున్న వారు వెంటనే స్పందించడం వల్ల ఒక ప్రాణం నిలిచింది..

 

 

ఈ వీడియోలోని దృష్యాలను చూస్తే అతి వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఓ పాదచారిపైకి దూసుకెళ్లింది. దీంతో అతడు కారు కింద చిక్కుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి జనాలు ఆ కారును 60 సెకన్ల వ్యవధిలో  పైకెత్తి అతడి ప్రాణాలు కాపాడారు. కొందరు చూసుకుంటూ మనకేంది దురద అని వెళ్లుతుంటే, మానవత్వం ఉన్న వారు మాత్రం సాటి మనిషికి సాయం చేసారు.. అసలు అర్ధం చేసుకుంటే ఇదే నిజమైన జీవితం. ఇలా సహాయపడుతూ జీవిస్తే మనిషి దరికి రావడానికి కష్టాలు కూడా బయపడతాయి.. అందుకే పెద్దల మాటలు అబద్దాలు కావు అంటారు.. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: