ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలం క్రితం అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతో అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పడం... ఆ తర్వాత రాజధాని అధ్యయన కమిటీ నివేదికలు రావడం.. ఇక చివరికి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన విమర్శలు చేసిన మూడు రాజధానిల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడం... మూడు రాజధాని లకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మూడు రాజధానిలో నిర్మించి అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. దీని కోసం ఏకంగా శాసన మండలి ద్వారా ఎన్నో రాజకీయ ప్రయోజనాలను ఉన్న అవన్నీ  పక్కనపెట్టి శాసన మండలి రద్దు కూడా చేశారు జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 అయితే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానిల  అభివృద్ధి ఎలా  జరుగుతుందని పలువురు లో నెలకొన్న ప్రశ్న. అయితే మూడు రాజధాని అభివృద్ధి కోసం నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్లాన్ తో నే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానిల  అభివృద్ధికి కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి  సర్కార్ నిధులు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కేంద్రానికి బడ్జెట్ నిధులపై ఓ నివేదిక పంపినట్లు సమాచారం. 

 

 

 ఈ నివేదికలో  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిర్మించతలపెట్టిన 3 రాజధానులకు  నిధులు కేటాయించాలని జగన్ సర్కార్ కోరడం గమనార్హం. అటు కేంద్రం కూడా జగన్  పంపించిన నివేదికపై సానుకూలంగా ఉన్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానిలపై కేంద్రం ఏం చేయనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా  జగన్ సర్కారు మాత్రం కేంద్ర బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని సరైన సమయంలో మూడు రాజధానుల తో గురిచూసి కొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మూడు రాజధానిలపై సానుకూలంగా స్పందించి సరైన నిధులు కేటాయిస్తే గనుక  3 రాజధానిల  అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: