ధనం మూలం ఇదం జగత్... ఈ పదానికి నేటితరం జనాలు ప్రత్యక్ష ఉదాహరణ. పైసల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. మనిషి ప్రాణం కంటే పైసలకే ఎక్కువ విలువ ఇస్తారు. డబ్బు డబ్బు డబ్బు అంటూ... పైసల మాయలో పడిపోయి ప్రాణాలను హరించేస్తున్నారు. ఎంతో ప్రేమ ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్న బంధాలను కూడా మరిచి... ప్రాణాలు తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. పైసల కోసం కట్టుకున్న భర్తనే హతమార్చింది ఇక్కడొక కిరాతక భార్య. వివరాల్లోకి వెళితే.. ఆర్థిక వ్యవహారాల కారణంగా ఓ మహిళ తన అన్నదమ్ములతో కలిసి... తన రెండో భర్త అతికిరాతకంగా చంపేసిన దారుణమైన ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది. 

 

 చామరాజనగర్ జిల్లా కొల్లేగల్  కు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మైసూరులోని విజయనగరం కు చెందిన రష్మి అనే మహిళతో కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అయితే అప్పటికే ఆ మహిళలకు వివాహమై కొడుకు ఉన్నప్పటికీ...విభేదాలు రావడంతో భర్త నుంచి దూరంగా ఉంటుంది ఆ మహిళ. ఇక తర్వాత ఫేస్ బుక్ లో పరిచయం  కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. నాలుగేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంని  రష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్ళ వరకు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ మాయదారి డబ్బు వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టి వారి ప్రాణాలను బలిగొంది. గతేడాది రష్మి కుటుంబ సభ్యులు ఆమె ఆస్తి వాటా నిమిత్తం 1.10 కోట్లు ఇచ్చారు. 

 

 

 అయితే ఈ సొమ్ము నుంచి తనకు వ్యాపారం నిమిత్తం ఎనభై మూడు లక్షలు కావాలంటూ భర్త సుబ్రహ్మణ్యం తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు  ఇక అవగాహన లోపం ఉండడంతో స్టాక్మార్కెట్లు ఆ సొమ్ము ఆవిరై పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న భార్య రష్మి తన డబ్బును తనకు తిరిగి ఇచ్చేయాలి అంటూ డిమాండ్ చేస్తుంది. అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య రష్మి తన సోదరులు రాకేష్ ప్రదీప్ మరొకరితో కలిసి... తన భర్త సుబ్రహ్మణ్యంను బెంగళూరులో కిడ్నాప్ చేసి ముదిగుండంగి కి తరలించి అక్కడ చిత్రహింసలకు గురిచేసింది.

 

 

 అతడి చేతి వేళ్లకు గోళ్లను పీకడం ఇనుప కడ్డీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేయడం లాంటివి చేశారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకపోవడంతో తీవ్ర గాయాలతో ఉన్న సుబ్రహ్మణ్యంను  అతని ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతనిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మైసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.కాగా సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతూ మరణించాడు. అయితే సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు భార్య  రష్మీ పై ఫిర్యాదు చేయగా భార్య రష్మీ ని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. సొమ్ము మొత్తం స్టాక్ మార్కెట్ లో పెట్టి పోగొట్టాడు అని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు రష్మి పోలీస్ విచారణలో నేరం అంగీకరించింది. కాగా  ఈ ఘటనలో నిందితురాలుకు సహాయం చేసిన మిగతా వారిని గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: