దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అన్నది ఒక నానుడి. పేదరికం అవిటితనం ఇలాంటివి దృఢ  సంకల్పం ముందు ఏవి నిలబడలేవు అని ఎంతోమంది నిరూపించారు. లక్ష్యాన్ని చేరుకోవడం  దిశగా పట్టుదలతో ప్రయత్నించి దృఢ  సంకల్పంతో ముందుకు సాగి... తమ తమ లక్ష్యాలకు చేరువై అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వారు ఎంతోమంది. పెద్ద  కలలు కనటమే  కాదు... కలలను సాకారం చేసుకోవాలని మేధావులు చెబుతూనే ఉంటారు. వీటన్నింటికీ ఒక అసలు సిసలైన ఉదాహరణ ఇక్కడ ఓ కండక్టర్. అప్పటికే పేదరికం.. అయినప్పటికీ తన లక్ష్యానికి మాత్రం ఏది అడ్డుపడి ఆపలేక  లేకపోయింది. తాను పేదవాడు అయినప్పటికీ కండక్టర్ నుంచి కలెక్టర్ కావాలి అనుకున్నాడు. పెద్ద పెద్ద అకాడమిలో శిక్షణ పొందే స్తోమత లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోయాడు. 

 

 

 దూరవిద్య లోనే డిగ్రీ పీజీ లు పూర్తిచేసి సివిల్స్ పరీక్షలో మెయిన్స్  అధిగమించాడు ఇక్కడ ఒక యువ కండక్టర్. కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లికి చెందిన ఎన్సీ మధు... బెంగుళూరులోని కొత్తలూరు 34వ బిఎన్టిసి డిపో లో కండక్టర్ గా పని చేస్తున్నాడు. 19వ ఏట ఉన్నప్పుడే కండక్టర్ ఉద్యోగానికి సంపాదించాడు. కానీ అతని ఆశ మాత్రం కలెక్టర్ కావాలని. దీంతో వైపు కండక్టర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే  దూరవిద్య ద్వారా డిగ్రీ పీజీ పూర్తి చేశాడు. 2019 సంవత్సరంలో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యాడు. ఏకంగా మెయిన్స్ పరీక్షలు పాసై ఇంటర్వ్యూ కూడా ఎంపికయ్యాడు. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూ పాస్ అయితే కలెక్టర్ అయినట్లే. 

 

 

 రెండుసార్లు పరీక్షల్లో  నిరాశ ఎదురైనప్పటికీ నిరుత్సాహపడకుండా ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో యూట్యూబ్ లోనే సివిల్స్ పరీక్షలు మెళకువలు నేర్చుకున్నాడు. తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో  యూట్యూబ్ వీడియోల ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధం అయ్యాడు. ఇక 2019 మెయిన్స్ రాసి సత్తా చాటాడు. అయితే దీని గురించి స్పందించిన మధు తాను ఇప్పటివరకు ఎక్కడికి కోచింగ్కు వెళ్లలేదని కేవలం ప్రతిరోజూ ఐదు గంటలపాటు యూట్యూబ్లోని కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షలకు సిద్ధం అయినట్లు తెలిపారు. తనకు ఇప్పటి వరకు యూట్యూబ్ ఏ మార్గదర్శకంగా మారిందని ప్రస్తుతం తన ఇంటర్వ్యూ పైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఏదేమైనా కృషి ఉంటే నాస్తి దుర్భిక్షం అన్నది మరోసారి నిరూపించాడు యువ కండక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: