పాపం.. విశాఖ వాసులు.. సాధారణంగానే విశాఖ చాలా ప్రశాంతమైన ప్రాంతం. అటు మెట్రో కల్చర్.. ఇటు అమాయక ఉత్తరాంధ్ర సంస్కృతిల మేలు కలయిక. నౌకాశ్రయంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కారణంగా ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడ ఎక్కువగానే ఉంటారు. అందుకే అదో ప్రశాంత నగరంగా ఎదిగింది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఏపీ సీఎం జగన్ నిర్ణయంతో ఇది ఏపీ రాజధాని కాబోతోంది. 

 

అయితే రాజధాని అమరావతి నుంచి విశాఖ రావడం ఏమాత్రం ఇష్టం లేని.. ఎల్లో మీడియా ఇప్పుడు అందమైన విశాఖపై బురద జల్లుతోంది. నిన్న గాక మొన్న విశాఖకు మావోయిస్టుల ముప్పు ఉందంటూ తమ మీడియాలో ఊదరగొట్టారు. అయితే దీన్ని వైసీపీ నేతలు బాగానే ఎదుర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో గతంలో హోంమంత్రి మాధవరెడ్డి మావోయిస్టుల చేతిలో హత్యకు గురవలేదా.. అంటూ లాజిక్ తో చెక్ పెట్టారు. 

 

ఇక ఇప్పుడు విశాఖకు హుద్ హుద్ ముప్పు ఉందంటూ జీఎన్నార్ కమిటీ రిపోర్టులోనే ఉందటూ ప్రచారం మొదలుపెట్టాయి. అంతే కాదు.. చంద్రజ్యోతిగా పేరున్న పత్రిక మరో అడుగు ముందుకేసింది.. అసలు మాకు రాజధాని వద్దు బాబోయ్ అని విశాఖ వాసులు మొత్తుకుంటున్నారట. " మేం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం మా ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అనుచరులు విశాఖలో వాలిపోతారన్న భావనే మాకు రుచించడం లేదు. 

 

మేం సంపాదించుకున్న భూములకు టికానా ఉండదా? అన్న ఆందోళనలో మేం ఉన్నాం అని ఏకంగా ఓ మంత్రే అన్నారట. అంతే కాదు.. విశాఖలో స్థలాలు, భూములు ఉన్నవారు అవి కబ్జాకు గురవుతాయేమోనన్న భయంతో ప్రహరీలను నిర్మించుకుంటున్నారట. పాపం ఎల్లో మీడియా వార్తలతో విశాఖ వాసులు భయపడుతున్నారు. తమ విశాఖపై ఇంకా ఎన్ని అభాండాలు వేస్తారో అని ఎల్లో మీడియాను చీదరించుకుంటున్నారు. బ్యాడ్ యెల్లో మీడియా..

మరింత సమాచారం తెలుసుకోండి: