ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ... కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన చాలావరకు హామీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే నెరవేర్చారు. ఎన్నో సంచలన పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు ఒక్కో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి చాలావరకు హామీలను నెరవేర్చారు . ఇకపోతే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు పూర్తవుతుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలకు ఉపిరిపోసారు. 

 

 కొన్ని నూతన పథకాలు ప్రవేశ పెడితే ఇంకొన్ని పాత పథకాలకు సరికొత్త హంగులతో పేరుమార్చి ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు వరకు ఎనిమిది నెలల పాలన బాగానే ఉన్నప్పటికీ ఈ వచ్చే రెండు నెలలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి  కి అగ్ని పరీక్ష లాంటిది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధాని లకు సంబంధించిన రగడ రాష్ట్రంలో రగులుతోంది. ఇదే కాకుండా ఎన్నో అంశాలు ప్రస్తుతం సీఎం జగన్ రాబోయే  పాలనలో ఎంతో కీలకంగా మారనున్నాయి. కాగా జగన్ సర్కారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ఇంకొన్ని రోజుల్లో కొత్తగా బియ్యం కార్డులు, రేషన్ కార్డులు,  ఆరోగ్యశ్రీ కార్డులు ఇలా పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్డులను పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ఇకపోతే పథకాలను ప్రవేశపెట్టారు కానీ సరికొత్త నిబంధనలతో కార్డుల జారీ ప్రక్రియలో లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 

 

 

 కాగా  ఉగాది వరకు 25 లక్షల ఇళ్ల పట్టాలు  పంపిణీ చేయాలన్నది జగన్ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నప్పటికీ భూమి కొరత మాత్రం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనం బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పలు సంక్షేమ పథకాల కు సంబంధించిన కార్డుల పంపిణీ ప్రక్రియ.. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు ప్రక్రియ కూడా... రాష్ట్ర ప్రజలు వారిని నొప్పించకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ పరుగులు పెట్టి ఇస్తుండడంతో పాటు... వైసీపీ నేతలు అందరిని లక్ష్యం దిశగా ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. మరి జగన్ ముందు ఉన్న ఈ టార్గెట్ ను ఆయన రీచ్  అవుతారా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: