స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి. జనవరి 28 న పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ జయంతి సందర్బంగా మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. డోన్ స్ధానిక వెంకటేశ్వరస్వామి గుడి సమీపం లోని సిద్థార్థ స్కూల్  నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యంలో స్కూల్ కరస్పాండెంటు బి.దినేష్ అద్యక్షతన  ముఖ్య అతిథిగా కృష్ణారెడ్డి గారు హాజరై  శ్రీ పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్  జయంతి సందర్బంగా  వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు  ప్రసాద్, మనోహర్ ,సలీమ్ ,భారతి,రజిత  విద్యార్ధులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ బి. దినేష్ , సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్  రఫి, ఉపాద్యాయులు మనోహర్  లు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామములో ప్రముఖ పాత్ర వహించిన లాలా లజపతిరాయ్ గారు  జనవరి 28వ తారీఖు, 1865 వ సంవత్సరములో పంజాబ్ రాష్ట్రములో జన్మించాడు. విద్యార్థి దశ లోనె ఈయనకు లాలా హన్స్ రాజ్, పండిట్ గురుదత్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో పరిచయాలు ఏర్పడ్డాయి.  చిన్నప్పటి నుండి దేశానికి సేవ చేయాలి అన్న దృఢమైన కోరిక ఉండేది. అందువల్ల విదేశీయుల పాలన నుండి భారతదేశానికి విముక్తి కలుగజేయాలని సంకల్పం  పూనాడు. లాలా లజపతిరాయ్ కి గ్రంథ పఠనము బాగా ఆసక్తి ఉండేది.

ఈ గ్రంథ పఠనము ఈయనలో  జాతీయ భావాలను, దేశభక్తిని పెంపొందించాయి.  స్వాతంత్ర్యం సంపాదించుకోవటానికి విప్లవమే మార్గమని నమ్మాడు.లాలా లజపతి రాయ్ తన న్యాయ వాద వృత్తిని పూర్తిగా వదిలి మాతృ భూమిని బ్రిటిష్ సామ్రాజ్య వాద సంకెళ్లనుండి విముక్తి చేయాలి అని కృషి, పట్టుదలతో పోరాటము  చేశాడు. స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటం గురించి ప్రజల్లో చైతన్యంతో పాటు, ధైర్యాన్ని నింపి పోరాటం లో భాగస్వాములను  చేశాడు .ఈయన నాయకత్వం లో జలియన్ వాలా బాగ్ హాత్యాకాండకు నిరసనగా అనేక ప్రదర్శనలు పంజాబ్ అంతటా  జరిగినాయి.అందుకనే ఆయనను "పంజాబ్ కేసరి " అని భారతీయులు అభిమానంతో పిలుస్తారు. బ్రిటిష్ వారి లాఠిచార్జ్ వలన  ఛాతీ మీద బలమైన లాఠీ దెబ్బలు తగలటం వల్ల తీవ్రమైన  నొప్పితో నవంబర్ 17,1928 వ తేదీన స్వర్గస్తులైనారు.

లాలా లజపతిరాయ్ ఒక్క స్వాతంత్ర్యోద్యమము లోనే కాకుండా ఇతర రంగాలలో కూడా తన ప్రాముఖ్యతను చాటుకున్నారు. ఎందరో యువకులను స్వాతంత్య్ర ఉద్యమము వైపు నడిపించాడు. వారి హృదయాలలో స్వాతంత్ర్య సమరస్ఫూర్తిని రగిలించాడు. అలాగే ఆయన తన తల్లి గారైన గులాబీ దేవి పేరిట  ఆడవారికి వైద్య సేవలందించటానికి గులాబీ దేవి  చెస్ట్ హాస్పిటల్ ను ప్రారంభించాడు. ఈ విధంగా లాలా లజపతిరాయ్ ఒక్క  స్వాతంత్య్ర పోరాటంలోనే కాకుండా విద్యా, బ్యాంకింగ్ , వైద్యము వంటి రంగాల  ద్వారా ప్రజా సేవ చేసి భారతీయుల మనస్సుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్న  మహానుభావులు.

ఇటువంటి మన దేశ స్వాతంత్ర్యసమరయోధుల అడుగుజాడలలో నడవాలని కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి  ఆరోగ్యం పై విధ్యార్థులకు అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ,తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని ,నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జింక్ పుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాల లో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాల లో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని  తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: