ఇంకొక మూడు రోజులలో కొత్త బడ్జెట్ విడుదల కానుంది.. అలాంటి ఈ బడ్జెట్ లో ఏలాంటి మార్పులు జరగనున్నాయి ? అయితే ఈ బడ్జెట్ ద్వారా సామాన్యులకు ఎంత వరుకు లాభం ఉండనుంది.. లాభాల గురించి ఎక్కడ బయటకు రాకపోగా 50 వస్తువులపై ధరలు పెరుగుతాయి అని ఇప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి. 

                 

అసలు వృధ్దిరేటుపై కేంద్రం కోతలు ఆపుతుందా అంటే.. అసలు వాస్తవాలు ఏంటి అంటే ప్ర‌తిసారి రెండంకెల రేటు అంటే 10 శాతం అని చెపుతూ ఉంటుంది. కానీ ఆ రేంజ్‌లో ఉండ‌డం లేదు. ఈ కోణంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 

 

జులై - సెప్టెంబర్ మాసాల మధ్య రెండో త్రైమాసంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోయింది. తగినన్ని ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించినా... తగిన ఫలితం దక్కలేదు. 

 

పారిశ్రామిక రంగ వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచేలా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆశించిన ఫలితం లభించలేదు. మరి కేంద్రం ఈ వృద్ధి రేటు కోతలపై ఎం చేయనుంది? ఇప్పటికే ఈ వృద్ధి రేటు గురించి ఎన్నో ప్రయత్నాలు చేసింది.. మరి ఈ బడ్జెట్ మరో ప్రయత్నం ఎం చేయనుంది ? అసలు ఎం జరుగుతుంది అనేది చూడలి.

 

నిర్మలమ్మ బడ్జెట్ ఎంత మేర ఉంటుంది.. అసలు ఈసారి ఈ బడ్జెట్ వాళ్ళ సామాన్యులకు ఏమైనా మేలు జరుగుతుందా? వృద్ధిరేటు పరిస్థితి ఏంటి అనేవి అన్ని కూడా మనం బడ్జెట్ లోనే చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: