పచ్చదనం ప్రకృతికి అందం. కానీ రోజురోజుకు వాతావరణంలో వస్తున్న మార్పుల వలన. మానవుల జీవన శైలి వలన పచ్చదనం కరిగిపోతుంది. భవిష్యత్తు తరాలకు ధన సంపద ఇవ్వకపోయినా ఎటువంటి నష్టం లేదు కానీ వన సంపద ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతాయి. భూమి మీద పచ్చదనం రోజురోజుకు తగ్గిపోతూ ఉండటంతో భూమిపై కార్భన్ డై యాక్సైడ్ లెవెల్స్ పెరుగుతూ ఉండటంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. 
 
ప్రకృతి ప్రేమికులు ప్రజలు వ్యాపార అవసరాల కోసం పచ్చదనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మనుషుల విధానాల వలన పచ్చదనం రోజురోజుకు తగ్గిపోతుందని ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నారు. చాలామంది ప్రకృతి ప్రేమికులు పచ్చదనం గురించి ఎన్నో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం నింపటం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంబుసారి అనే ప్రకృతి ప్రేమికుడు గత కొన్ని సంవత్సరాలుగా పచ్చదనం కోసం కృషి చేస్తున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంబుసారి అనే వ్యక్తి 60 సంవత్సరాల వయస్సులో కూడా ప్రకృతిపై ప్రేమతో పచ్చదనం గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 11 సంవత్సరాలుగా సైకిల్ పై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అంబుసారి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఇప్పటికే 45,610 కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసుకున్నాడు. తన ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటిస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రం దగ్గరకు చేరుకున్నాడు. 
 
ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రంలోని అగ్నిమాపక దళాధికారి ఉమా మహేశ్వరరావు మరియు అగ్నిమాపక సిబ్బంది అంబుసారికి ఘన స్వాగతం పలికారు. అంబుసారి మాట్లాడుతూ ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ప్రజలకు పచ్చదనం యొక్క ఆవశ్యకతను వివరించానని చెప్పారు. ఆక్సిజన్ ను అందించే నత్తల పెంపకం కూడా ప్రతి ఒక్కరు చేపట్టాలని తాను యాత్ర చేస్తున్నట్టు అంబుసారి తెలిపారు. దేశాన్ని గ్రీన్ ఇండియాగా మార్చడమే తన ముఖ్య ఉద్దేశమని ప్రజల ప్రాణాలకు పచ్చదనం కరువైతే ముప్పని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: