జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు శాసనమండలి అడ్డుకొని  సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసి పార్లమెంటుకు పంపించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . అయితే శాసన మండలి తీర్మానాన్ని కి అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ పార్లమెంట్లో మాత్రం ఆమోదం పొందదు అంటూ టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 శాసన మండలి రద్దు  విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వివరిస్తుంది అంటూ బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శాసన మండలి రద్దు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందని... కానీ స్టాండింగ్ కమిటీ సూచనల యొక్క అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంట్ తీసుకుంటుందని తెలిపారు. అయితే మండలి రద్దు తీర్మానంపై ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యం జరగదు అంటూ జీవీఎల్ నరసింహారావు పేరు చెప్పారు. 

 

 ఏపీ మండలి రద్దు నిర్ణయాన్ని తాము రాజకీయ కోణంలో చూడటం లేదు అంటూ వ్యాఖ్యానించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు... శాసన మండలి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడం లేదా ఆలస్యం చేయడం లాంటివి కేంద్రం చేయదు  అంటూ తేల్చి చెప్పారు. కేవలం వ్యవస్థకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.కొందరు  కావాలని కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అయితే శాసన మండలి తీర్మానాన్ని ఆమోదించడం వల్ల... తమ పార్టీకి రాజకీయంగా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో  అని ఆలోచించడం లేదని కేవలం వ్యవస్థకు లోబడి  ముందుకు సాగుతామని  స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: