ఉప్పెనలా వచ్చిన అమరావతి ఉద్యమం చప్పున చల్లారింది. అమరావతి లో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూల మీడియా గా  పచ్చ మీడియా గా పేరు పొందిన ఓ రెండు మీడియా ఛానెల్స్ హడావుడి చేశాయి. దీంతో అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో, అక్కడి ప్రజలకు కూడా ప్రజలు కూడా సరిగా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యారు. అసెంబ్లీలో అమరావతి పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరు ఎంత భూములు కొన్నారు..? అనే విషయం ఆధారాలతో సహా ప్రభుత్వం బయటపెట్టింది. దీంతో ప్రజలకు అసలు విషయం బోధపడింది.


 ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో రాజధాని నిమిత్తం భూములు కేటాయించిన వారు ఎవరూ నష్టపోకుండా జగన్ ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు కొన్ని వరాలు ప్రకటించడంతో అమరావతిలో రాజధాని ఉద్యమం ఆగిపోయింది. అయితే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో పచ్చ మీడియాగా ముద్రపడిన రెండు మీడియా ఛానల్స్ అదేపనిగా అమరావతిలో అల్లకల్లోలం జరిగిపోతున్నట్లు కథనాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. కొంతమంది టిడిపి నాయకులు ఆ ప్రాంతంలో చేస్తున్న ఆందోళనను పెద్ద ఉద్యమంగా  చిత్రీకరిస్తూ టీడీపీకి మేలు జరిగే విధంగా జగన్ ప్రభుత్వం పై బురదజల్లే విధంగా వ్యవహరిస్తుండడంతో ప్రజల్లో ఆ మీడియా ఛానల్స్ పై మరింతగా చులకన భావం ఏర్పడింది. 


ఈ విషయం సదరు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు తెలిసినా ఇవన్నీ మామూలే అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో కొంతమంది టిడిపి నాయకుల ఆందోళనను  ప్రజల ఉద్యమమంగా చూపిస్తూ కొంతమంది టిడిపి నాయకుల వివరణలను ప్రచారం చేస్తూ ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించకపోతే దేశానికి ముప్పు అన్నట్టుగా కథనాలు వండి వార్చుతూ జనాల్లో మరింతగా నవ్వులపాలు అవుతున్నారు. కేవలం అమరావతి విషయంలోనే కాకుండా జగన్ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం పైన ఇదే స్థాయిలో బురదజల్లే ఎందుకు మీరు కాచుకుని కూర్చుని ఉన్నారు.


 గతంలో ఇదే తరహా వ్యవహారాలు చేసి ప్రజల నుంచి మేధావుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఈ రెండు న్యూస్ ఛానల్స్ మాత్రం తమ పంథాను మార్చుకోవడంలేదు. యధావిధిగా బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం తిడుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో గత టిడిపి ప్రభుత్వంలో బినామీ పేర్లతో భూములు కొన్న నాయకుల వివరాలను దాచి పెడుతూ ...అసలు ఆ వ్యవహారాలతో ఆ పార్టీకి సంబంధం లేదన్నట్లుగా కథనాలు ఈ రెండు న్యూస్ ఛానల్ ప్రచారం చేసుకుంటూ తమ మీద పడ్డ పచ్చ మీడియా అనే బిరుదుని నిలబెట్టుకునే పనిలో పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: