చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. చంద్రబాబు అంటే యు టర్న్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చందబ్రాబు యూటర్న్ తీసుకున్నాట్టు మారె నాయకుడు తీసుకోలేరు అని.. ఏ ఒక్క అమషంపైన చంద్రబాబు నిర్దిష్టంగా తమ నిర్ణయం ఇది అని ఏనాడూ చెప్పలేదని.. అందుకే చంద్రబాబుని యూటర్న్ బాబు అనేది అంటూ అయన భారీ ఎత్తున విమర్శలు గుప్పించారు.. 

         

చంద్రబాబు అధికారంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ మనుగడ కోసం మాట మార్చే తత్వం ఆయనది అని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బొత్స సత్యనారాయణ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జీఎన్‌రావు, బోస్టన్‌ కమిటీ నివేదిక అంశాలను హైపవర్‌ కమిటీ పరిశీలించే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. 

             

జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ నివేదికలు చిత్తు కాగితాలంటూ గతంలో చంద్రబాబు విమర్శించారని.. ఇప్పుడు మళ్లీ యూటర్న్‌ తీసుకుని ఆ కమిటీ నివేదికల్లో విశాఖకు తుపాను ముప్పు ఉందని చెబుతున్నారని, శివరామకృష్ణన్‌ కమిటీని చంద్రబాబు అసలు పట్టించుకోలేదని అయన అన్నారు.. అయితే చంద్రబాబు విశాఖకు తుపాన్ ముప్పు అని చెప్పిన మాటలపై మంత్రి బొత్స సతయనారాయణ మాట్లాడుతూ చెన్నైకి, ముంబైకి ముప్పు లేదా అని ప్రశ్నలు వేశారు.. 

 

''తుపాన్లు వస్తే మాత్రం విశాఖ ఏమైనా కొట్టుకుపోతుందా? తుపాన్లతో విశాఖకు పెద్దగా నష్టం ఉండదు. అమరావతికీ వరద ముప్పు ఉంది. దానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఐదేళ్లకో, పదేళ్లకో వరద వస్తూనే ఉంటుంది. చెన్నై, ముంబయి నగరాలకు ముప్పు లేదా?’’ అని బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: