న్యూజిలాండ్ ఇండియా జట్ల మధ్య నేడు మూడవ టీ20 మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి రెండు జట్లు . ముఖ్యంగా న్యూజిలాండ్ కు బాగా అచ్చొచ్చిన సెంటిమెంట్ స్టేడియం అయినా సెడాన్  పార్క్ వేదికగా మూడో టి20 మ్యాచ్ జరుగుతుండడం గమనార్హం.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను పెంచుకుని టీమిండియా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి చేసింది. ఓపెనింగ్ లోనే టీమిండియాకు మంచి ఆరంభం  దక్కింది అని చెప్పాలి. 

 

 

 మ్యాచ్  మొదట్లోనే రోహిత్ శర్మ తనదైనా మెరుపులు మెరిపించి 67 రన్స్  చేసి ఆఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా తనదైన స్టైల్ లో  బ్యాటింగ్ చేసి అద్భుతంగా రాణించారు. కానీ ఆ తర్వాత రాహుల్ రోహిత్ శివం దూబే లు  ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే పెవిలియన్  చేరడంతో టీమిండియా యొక్క రన్ రేట్  ఒక్కసారిగా పడిపోయింది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి రాణించడంతో భారత్ 179 పరుగులు చేయగలిగింది. 185 పరుగుల తేడాతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు... బ్యాట్ మెన్స్  మొదటినుంచి దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా రన్ రేట్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ వచ్చి ... బౌలర్లను  అందర్నీ ప్రెషర్ లోకి  నెట్టారు. ఇక ఆ తర్వాత వెంటనే ఓపెనర్లు ఇద్దరు అవుట్ కావడంతో న్యూజిలాండ్ స్కోర్  నత్తనడకన నడిచింది. ఆ తర్వాత వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ తనపైన మెరుపులు మెరిపించి సిక్సర్లు బాదుతూ  56 పరుగులు చేసి... మ్యాచ్ ముగించేలా కనిపించాడు. 

 

 

 ఇక న్యూజిలాండ్ ఇండియా  మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రేక్షకులందరూ కన్నార్పకుండా చూసేలా అందరిని  టెన్షన్ లో పెట్టేసింది. చివరికి ఈ మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ లో ఫలితం ఫలితం తేలాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ మొదట వాడిన కివీస్ జట్టు 18 పరుగులు చేయగా... తర్వాత సూపర్ టీమిండియా జట్టు హిట్ మ్యాన్  హిట్టింగ్ తో మ్యాచ్ విజయం సాధించింది. ఒక బంతి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: