తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. జరిగిన ఈ ఎన్నికలలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బి.జె.పి బాగా రాణించాలని అధికార పార్టీ టిఆర్ఎస్ కి చెక్ పెట్టాలని భావించడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆ తర్వాత రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నాయకులు కెసిఆర్ నాయకత్వంపై మరియు ఆ పార్టీకి చెందిన మంత్రులు పై తీవ్రస్థాయిలో దారుణంగా విమర్శలు చేయటం స్టార్ట్ చేశారు.

 

అయితే ఆ తర్వాత మళ్లీ మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఈ బాధ్యతను కేటీఆర్ కి అప్పగించడం జరిగింది. దీంతో కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదరగొట్టే రీతిలో ప్రచారం చేసి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 119 మున్సిపాలిటీలను దేశంలో ఏ పార్టీ గెలవని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించే విధంగా విజయం సాధించింది. ఈ ఎన్నికలతో టిఆర్ఎస్ పార్టీ ని బలంగా నమ్ముతున్నారని తెలంగాణ ప్రజలు తెలియజేయడంతో పాటుగా రెండు జాతీయ పార్టీలకు కనీసం ప్రాణాలు కూడా రాకపోవడంతో కాంగ్రెస్- బిజెపి పార్టీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు.

 

అయితే ఇటువంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ చట్టాన్ని గౌరవించి పరిపాలించాలని చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని పదవులు కూడా ఊడిపోతాయి అని గట్టిగా కేటీఆర్ హెచ్చరించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు చాలా గట్టిగా ఉంటాయని చాలా బలంగా చెప్పారు. దీంతో కేటీఆర్ చట్టాలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయితే చట్ట ప్రకారమే పరిపాలన ఉంటుంది అన్నట్టుగా కెసిఆర్ వ్యవహరిస్తున్న విధానం బట్టి తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: