దేశంలోనే ఎన్నికల వ్యూహకర్తగా అద్భుతమైన పేరు సంపాదించారు ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రధానమంత్రి అవడానికి వెనక ఉండి నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఆ సమయంలో బీజేపీ దేశ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు రాబట్టి గెలవడం జరిగింది. మోడీ గాలి దేశవ్యాప్తంగా బాగా వేసింది. దాంతో మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు సరిగ్గా ప్రజా సంకల్ప పాదయాత్ర స్టార్ట్ చేసిన సందర్భంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తో చేతులు కలిపి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ...జగన్ ముఖ్యమంత్రి అవటానికి ప్రముఖ పాత్ర పోషించారు.

 

ప్రతి చోట సర్వే చేయించి పార్టీ వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థులను దెబ్బ కొట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ మరియు జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా అయ్యేవిధంగా చావు దెబ్బ కొట్టారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ పై దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన పై సీరియస్ అయ్యారు. మేటర్ లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం.

 

ఈ రాష్ట్రంలో జేడీయూ పార్టీతో కలిసి అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా జెడియు పార్టీ తరఫున ఖండించడం తో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న జెడియు అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ పై సీరియస్ అయ్యారు అంతేకాకుండా పార్టీ నుండి బహిష్కరించారు.

 

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉపాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఇరు పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు.పార్టీ నిర్ణయంపై ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. ‘‘థాంక్యూ నితీశ్‌ కుమార్‌. మీరు మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’అని ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: