ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడదీసిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రముఖులు ఆ పార్టీ నుండి పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల నుండి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం కేవలం 1.29 శాతం కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీని అటు ప్రజలు, ఇటు ప్రజల్లో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఏపీ కాంగ్రెస్ కు కొత్త కమిటీ కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసీరెడ్డి, మస్తాన్ వలి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్టానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఏపీలో ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రఘువీరా రెడ్డి గతంలో రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాథుడు కూడా లేదు. 
 
ఇలాంటి సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీని ఏర్పాటు చేయడం వలన కానీ శైలజానాథ్, తులసీ రెడ్డి, మస్తాన్ వలి పదవీ బాధ్యతలు స్వీకరించడం వలన కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కొత్తగా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడటం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ఏపీలో దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ముగ్గురు ఎన్ని రిపేర్లు చేసినా ఫలితం శూన్యం అని ఏపీ ప్రజానీకం నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: