గతమెంతో ఘనం.. ప్రస్తుతం అథమం.. భవిష్యత్తు శిథిలం...ఇదే ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అంటే తిరుగులేని పార్టీ. కానీ రాష్ట్రం విడిపోయాక, వైసీపీ ఎంటర్ అయ్యాక కాంగ్రెస్ అడ్రెస్ లేని పార్టీ. కనీసం పంచాయితీ కూడా గెలవలేని పార్టీ. 2014, 2019 ఎన్నికల్లో నోటా కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. అయితే ఇలాంటి పార్టీతో మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు కొన్ని వ్యూహాలు వేసి, వైసీపీ ప్రభుత్వంపై విషం చల్లాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు.

 

2018 ఎన్నికల్లో బాబు, కాంగ్రెస్‌తో కలిసి తెలంగాణలో చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో చక్రం తిప్పలాని బాబు బొక్కబోర్లాపడ్డ విషయం తెలిసిందే. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాబు అధికారం కోల్పోయారు. ఊహించని విధంగా జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ అధికార పీఠం ఎక్కి 10 రోజులు కూడా కాకమునుపే బాబు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి మొదలు ఇప్పుడు అమరావతి ఇష్యూ వరకు ఏదొకటి తెరపైకి తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు.

 

అటు బాబు పార్ట్‌నర్ పవన్ కూడా అదే బాటలో వచ్చిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జగన్‌పైనే విమర్శల దాడి చేశారు. అలాగే బాబు...కమ్యూనిస్ట్ నేతలని కూడా తమవైపు తిప్పుకుని రాజకీయం చేసేస్తున్నారు. ఇక వీరందరికి తోడు ఏపీలో బ్రతికిలేని కాంగ్రెస్ కూడా జగన్‌పై విమర్శలు చేస్తుంది. ఆ పార్టీ నేతలు అందరూ బాబు లైన్‌లోనే ఉంటూ..జగన్‌పై పడుతున్నారు. ముఖ్యంగా తులసిరెడ్డి లాంటి వారైతే చెప్పనక్కర్లేదు. ఆయన యాజ్ ఇట్ ఈజ్ బాబు మాదిరే మాట్లాడుతున్నారు.

 

అయితే కాంగ్రెస్ అంతర్గత కార్యక్రమాల్లో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలనే సూచనలు రావడంతోనే, కాంగ్రెస్ నేతలు అలా మాట్లాడుతున్నారని తెలిసింది. ఆ సూచనలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియాల్సిన అవసరం లేదు. పైగా తాజాగా కాంగ్రెస్ కొత్త పి‌సి‌సి, వర్కింగ్ ప్రెసిడెంట్‌లని నియమించింది. పి‌సి‌సి అధ్యక్షుడుగా శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీలని నియమించారు. ఇందులో ముఖ్యంగా జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే తులసిరెడ్డికి పదవి ఇచ్చారని సమాచారం. అయితే వీరు ఎంత విష ప్రచారం చేసినా...ప్రజా బలం ఉన్న జగన్‌ని నెగిటివ్ చేయలేరు.  మొత్తం మీదైతే ముసలి కాంగ్రెస్‌తో 70 ఏళ్ల యువకుడు బాబు పనికిమాలిన స్కెచ్ భలే వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: