ఈరోజు ఢిల్లీలో గడచిన నాలుగు రోజుల నుండి ఘనంగా సాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. బీటింగ్ రిట్రీట్ లో రైసానా హిల్స్ లోని విజయ్ చౌక్ వెంబడి జరగగా 14 మిలటరీ బాండ్స్ మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించాయి. ఆహుతులను త్రివిధ దళాలకు చెందిన సైనికులు దేశభక్తి భావనను పాదుగొలుపుతూ సాగించిన మార్చ్ ఫాస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.                           
 
ఘనంగా జరిగిన ఈ వేడుకలో త్రివిధ దళాల అధిపతులతో పాటు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ అడ్వయిజరీని జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు రఫీ మార్గ్, రైసానా రోడ్, ఓరా షికోహ్ రోడ్, కృష్ణ మీనన్ మార్గ్, సునెహ్రి మసీదు గుండా విజయ్ చౌక్ గుండా వెళ్లే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలను విధించారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకూ మెట్రో రైలు కార్పొరేషన్ కూడా సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లలో ఆంక్షలు విధించారు. మెట్రో రైలు కార్పొరేషన్ కేవలం గేటు నంబర్ 1 నుండి మాత్రమే వెళ్లేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. గేటు నంబర్ 1 కాకుందా మిగతా గేట్లను ఈ సమయంలో ముసివేశారు. 
 
ఈ వేడుకను తిలకించడానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిధ దళాల సైనక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: