ఒకే ఒక భారీ ఓటమి టీడీపీని కోలుకోలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి ఏది కలిసి రావడం లేదు. ఓ వైపు జగన్ అద్భుత పాలనతో దూసుకెళుతూ, ప్రజలని మరింతగా తన వైపు తిప్పుకుంటుంటే, బాబు వరుస వైఫల్యాలతో ప్రజలకు మరింత దూరం అవుతున్నారు. బాబుకు ప్రజలే కాకుండా సొంత నేతలు కూడా దూరమాయ్యారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు అధికారం కోల్పోగానే బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. మరికొందరు అదే పనిలో బిజీగా ఉన్నారు.

 

అటు చాలామంది నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఓటమి దగ్గర నుంచి పెద్దగా బయటకొచ్చి బాబుకు మద్ధతు తెలిపిన సందర్భాలు లేవు. ముఖ్యంగా ఆ పార్టీ తరుపున ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్ధులు అడ్రెస్ లేరు. ఎన్నికల్లో టీడీపీ 3 ఎంపీలని గెలుచుకోగా, 22 చోట్ల ఓడిపోయింది. శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, గుంటూరు-గల్లా జయదేవ్, విజయవాడ-కేశినేని నాని(కృష్ణా)లు మాత్రమే గెలిచారు. వీరు ఎంపీలుగా ఉన్నారు కాబట్టి యాక్టివ్‌గానే ఉన్నారు. విజయనగరం ఎంపీగా ఓడిపోయిన అశోక్ గజపతి రాజు అప్పుడప్పుడు మీడియా ముందుకు మాత్రమే వస్తున్నారు.

 

అరకులో ఓడిపోయిన కిషోర్ చంద్రదేవ్ అడ్రెస్ లేరు. అనకాపల్లి ఎంపీ గా పోటీ చేసిన ఆడారి ఆనందకుమార్ వైసీపీలో చేరగా, విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు భరత్ మూడు రాజధానుల దెబ్బకు సైలెంట్ అయ్యారు. ఇటు తూర్పులో కాకినాడ-చలమలశెట్టి సునీల్, రాజమండ్రి-మాగంటి రూప(మురళి మోహన్ కోడలు), అమలాపురం-హరీష్ కుమార్(దివంగత బాలయోగి తనయుడు)లు పార్టీ వైపే చూడటం లేదు. పశ్చిమలో ఏలూరు ఎంపీగా ఓడిపోయిన మాగంటి బాబు మాత్రం అమరావతి ఉద్యమంలో బాబు వెనుక నడుస్తుండగా, నరసాపురంలో ఓడిపోయిన కలవపూడి శివ కంటికే కనబడటం లేదు. మచిలీపట్నంలో ఓడిపోయిన కొనకళ్ళ నారాయణ అప్పుడప్పుడు పార్టీ ఆఫీసులో మెరుస్తున్నారు.

 

బాపట్లలో ఓడిన శ్రీ రామ్ మల్యాద్రి అడ్రెస్ లేకపోగా, నరసరావుపేటలో ఓడిన రాయపాటి సాంబశివరావు బీజేపీలోకి జంప్ చేసేందుకు చూస్తున్నారు. ఒంగోలులో శిద్ధా రాఘవరావు లోకల్‌గా పార్టీలో ఉంటున్నారు. నెల్లూరులో ఓడిపోయిన బీదా మస్తాన్ రావు వైసీపీలోకి, కడపలో ఓడిన ఆది నారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక చిత్తూరు ఎంపీగా పోటి చేసిన శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. తిరుపతి-పనబాక లక్ష్మి, రాజంపేట-డి‌కే సత్యప్రభ, కర్నూలు-కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాల-మాండ్ర శివానందరెడ్డి, అనంతపురం-జేసీ పవన్, హిందూపురం-నిమ్మల కిష్టప్ప...ఇలా ఓడిపోయిన నేతలు ఎవరు టీడీపీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: