జీఎన్‌ రావు కమిటీ నివేదిక పై తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియా  వార్తలను రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్‌ రావు ఖండించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగిలి ఉన్న 13 జిల్లాలను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన కమిటీలో విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని కమిటీ నివేదికలను కొంతమంది తగలబెట్టడం చాలా బాధాకరమని కొన్ని వార్తా ఛానళ్లు మరియు పత్రికలు తమ నివేదికపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటిని ఖండిస్తున్నాం అని జీఎన్‌ రావు తెలిపారు.

 

అంతే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోదరి న్యూస్ ఛానల్ లో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము ప్రభుత్వానికి సూచించినట్లు ప్రచారం చేస్తున్నాయని వాటిలో వాస్తవం లేదని తెలిపారు. కొంతమంది ఆలోచనల మేరకు తమ కమిటీ పని చేసిందని వాటిని వేదికలుగా ప్రభుత్వానికి ఇచ్చినట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు తమ కమిటీలో ఉన్నారు ఎవరి ప్రలోభాలకు మరియు ఒత్తిళ్లకు ఎవరు మా కమిటీలో గురికాలేదని నాలుగు నెలలు కష్టపడి రాష్ట్రం మొత్తం పర్యటించి నివేదికను అందజేశామని తెలిపారు.

 

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం బెస్ట్‌ ఆప్షన్‌ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా కర్నూలులో హైకోర్టు పెడితే రెండు జిరాక్స్ మిషన్ మరియు సెంటర్లు వస్తాయని వార్తలు ప్రసారం చేయడం చాలా బాధాకరమని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగిందని జీఎన్‌ రావు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: