తప్పు చేసిన వారు సొంత వారైనా, పరాయి వారైనా ఏపీ సీఎం జగన్ ట్రీట్మెంట్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువయ్యింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత జగన్ ఈ విషయంలో చాలా నిక్కర్చిగా వ్యవహరిస్తున్నారు. ఇక మంత్రి మండలి ఏర్పడిన తొలినాళ్లలోనే మంత్రులందరికీ పిలిచి మరీ జగన్ చాలా జాగ్రత్తలే చెప్పారు. అనవసర వివాదాల జోలికి వెళ్లోద్దని, ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు పెత్తనం చేయవద్దని, అలా చేస్తే తాను చూస్తూ ఊరుకోను అంటూ చెప్పారు. అయినా అనేకసార్లు ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకున్నాయనే విషయాలు జగన్ వరకు చేరుతున్నాయి.అయినా కొంతకాలంగా ఓపిగ్గా ఉంటూ పార్టీలోని కీలక నాయకుల ద్వారా వారికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ విధంగా కొంతమంది పార్టీ నాయకుల్లో మార్పు రాగా మరికొందరు మాత్రం తాము రాజకీయాల్లో సీనియర్ అని, జగన్ తండ్రి రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులం అంటూ చెప్పుకుంటూ తోక జాడిస్తున్నారట. అయితే ఈ విషయంలో జగన్ కొంతకాలంగా ఓపిగ్గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఉత్తరాంధ్ర కు చెందిన ఓ మంత్రి జగన్ మాట లెక్క చేయకుండా ఇతర మంత్రుల నియోజకవర్గాల్లో వేలు పెడుతుండడం, అవి కాస్తా వివాదాస్పదం అవుతుండడంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగి సదరు ఉత్తరాంధ్ర మంత్రిని పిలిచి గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా సదరు మంత్రి వ్యవహారశైలిపైన జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. 


అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ కు వెన్నుదన్నుగా ఉంటూ ప్రభుత్వ విధానాలను ప్రజలకు అర్ధం అయ్యేలా వివరిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కృష్ణ జిల్లాకు చెందిన ఓ మంత్రి శాఖ‌లో వేలు పెట్ట‌డంతో ఆ మంత్రి సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో స‌ద‌రు ఉత్త‌రాంధ్ర మంత్రిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకారట. మీరు అసలు మీ శాఖను వదిలిపెట్టి వేరే శాఖ‌లో ఎందుకు వేలుపెడుతున్నారు మీ ప‌ని మీరు చూసుకోండ‌ని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఉత్తరాంధ్ర మంత్రి షాక్ అయ్యారట. ఆ మంత్రికి గట్టిగా క్లాస్ పీకిన సంగతి మిగతా మంత్రులకు కూడా తెలియడంతో వారంతా అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: