ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒక దేశం చైనా. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా కూడా దూసుకుపోతుంది. ఆసియాలో క్రయవిక్రయాలకు మంచి మార్కెట్ కలిగిన దేశంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశంగా ఆసియాలోనే శక్తివంతమైన దేశంగా ఉన్న చైనా నీ ఇప్పుడు  కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజుల నుండి ఈ పేరు కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికించే విధంగా చేస్తుంది. మనిషి నుండి మనిషికి సోకే వైరస్ గా అంటువ్యాధిగా ప్రబలం అవుతున్న కరోనా వైరస్‌ నీ అరికట్టడానికి దేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి రాకపోకలను ఆపేసింది చైనా.

 

అంతేకాకుండా ప్రమాదకరమైన ఈ వైరస్ దేశంలో దాదాపు 6000 మంది కి సోకడంతో ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని 48 గంటల్లో వెయ్యి పడకల ఆసుపత్రిగా నిర్మించి తన దమ్మేంటో మరొకసారి నిరూపించింది చైనా. కరోనా వైరస్‌ మొట్టమొదట మానవుడికి సోకిన వుహాన్‌ పట్టణానికి సమీపంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ నగరంలో దీన్ని తీర్చిదిద్దారు. అటు భవన నిర్మాణ సిబ్బంది తమ పనులు తాము చేసుకుపోతుండగానే ఇటు ఆస్పత్రి సిబ్బంది రెండు రోజులు అవిశ్రాంతంగా శ్రమించి పడకలను, వైద్య పరికరాలను, కంప్యూటర్‌ స్క్రీన్లను, ఆక్సిజన్‌ లైన్లను, అవసరమైన ఇతర వైద్య పరికరాలను 48 గంటల్లోగా అమర్చారు.

 

ఈ భవనానికి చైనా ప్రభుత్వం ‘డెబ్బీ మౌంటేన్‌ రీజనల్‌ మెడికల్‌ సెంటర్‌’ అని పేరు పెట్టడం జరిగింది. మంగళవారం రాత్రి ఈ సమయంలో కరోనా వైరస్ సోకిన మొదటి బ్యాచ్ రోగులను తరలించి వారికి చికిత్స కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వ్యాధి నిర్ధారణ అయిన వుహాన్‌కు 75 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చైనా. ఈ హాస్పిటల్ కూడా మరో వారం రోజుల్లో పూర్తిగానున్నట్లు పూర్తి వైద్య సదుపాయాలు పది రోజుల్లో వైరస్ సోకిన వారికి అందుబాటులోకి వస్తాయని చైనా ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: