బయటకు తెలీలేదు కానీ బిజెపి మిత్రపక్షమైన  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద అవమానమే జరిగిందట.  మంగళగిరి నుండి హడావుడిగా ఢిల్లీకి వెళ్ళిన పవన్ బ్రహ్మాండాన్ని ఏదో బద్దలు కొట్టేస్తారని అనుకున్నారు. తీరాచూస్తే మొత్తం వ్యవహారం తుస్సుమనేసింది. రాజధానిని అమరావతి నుండి అంగుళం కూడా కదల్చేందుకు లేదని జగన్మోహన్ రెడ్డిని సవాలు విసిరిన పవన్ ఢిల్లీలో అసలామాటే ఎత్తలేదు.  కారణం ఏమిటయ్యా అంటే తగిలిన ఎదురు దెబ్బే అని పార్టీ వర్గాల సమాచారం.

 

దాదాపు రెండున్నర రోజు పవన్ ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే.  కమలంపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతోను అంతకుముందు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామాన్ తోను పవన్ భేటి అయ్యారు.  ఈ రెండు సందర్భాల్లో కూడా  జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని పవన్ ప్రస్తావించారని సమాచారం. అయితే ఈ విషయంలో వాళ్ళనుండి తాను ఆశించిన రెస్పెన్స్ రాలేదట. పైగా  ఆ అంశంతో తమకేమీ సంబంధం లేదని చెప్పేశారట.

 

సరే వీళ్ళతో కాకపోతే నేరుగా నరేంద్రమోడితోనో లేకపోతే అమిత్ షా తోనో తేల్చుకుందామని డిసైడ్ అయ్యారట. అయితే నడ్డాను కలిసినంత తేలిగ్గాదు మోడి, అమిత్ లను కలవటమని పాపం పవన్ కు తెలీలేదు. వాళ్ళిద్దరినీ కలుద్దామని ఎంత ప్రయత్నం చేసినా పవన్ కు అపాయింట్మెంట్ దొరకలేదట. పవన్ తరపున బిజెపి నేత ఎంత గట్టిగా ట్రై చేసినా ఉపయోగం కనబడలేదట.

 

వీళ్ళిద్దరిని కాకపోతే కనీసం అమిత్ షా ను అయినా కలవకుండ వెళితే ప్రిస్టేజ్ సమస్య అని మొత్తుకున్నా షా దర్శన భాగ్యం కూడా దొరకలేదని సమాచారం. పవన్ కు కాదుకదా అసలు బిజెపి నేతలకే అమిత్ తో మాట్లాడే అవకాశం దొరకటం లేదట. సొంతపార్టీ నేతలకే దొరకని అపాయింట్మెంట్ పవన్ కు దొరుకుతుందా ?

 

ఏదో ఇద్దరిలో ఎవరితోనో ఒకళ్ళతో ఫొటోలు దిగేసి బయటకు వచ్చి జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే సరిపోతుందని పవన్ అనుకున్నట్లున్నారు. కానీ దానికి ఇద్దరూ అవకాశం ఇవ్వలేదు. పైగా మొన్నటి ఎన్నికల్లో జనసేన సత్తా ఏంటో తెలిసిపోయింది. అందులోను స్వయంగా పవన్ రెండు చోట్లా ఓడిపోవటంతో  ఢిల్లీలో దేకే వారే కరువయ్యారు.  పొత్తు పెట్టుకుంటానంటే బిజెపి సరే అన్నది కానీ పవన్ సత్తా తెలీక కాదు. పవన్ కే బిజెపి వ్యవహారం అంతు పట్టటం లేదంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: