తాజాగా పద్మశ్రీ అవార్డుల ప్రకటన జరిగిన విషయం తెలిసిందే. ఈసారి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో మంది పద్మశ్రీ అవార్డును పొందారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ గాయకుడు అద్నాన్ సామి కి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి తెర లేపింది. బ్రిటన్ లో జన్మించిన పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమికి  పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తారు అంటూ... కాంగ్రెస్ ఎన్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

 

 

 1965 సంవత్సరంలో అద్నాన్ సామి తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పనిచేసి భారత్ కు  వ్యతిరేకంగా పోరాటం చేశారని... భారత్ కు  వ్యతిరేకంగా పాకిస్థాన్ నుంచి పోరాడిన వ్యక్తి కుమారుడికి భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన పద్మ శ్రీ పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారు అంటూ రాజకీయంగా పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే అద్నన్ సామికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని బీజేపీ సమర్థించింది. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఖండించాయి. అద్నాన్  సమికి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం సంచలనం రేపింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన సినీ  గాయకుడు అద్నాన్ సామీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 

 నాకు రాజకీయ నాయకులకు మధ్య ఎలాంటి గొడవలు లేవు... ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు అంటూ అద్నాన్  సమి తెలిపాడు. నేను ఒక సంగీత విద్వాంసుని మాత్రమే. నా గురించి చెడుగా మాట్లాడిన వారు ఎంతో మంది  రాత్రి సమయంలో మాత్రం మందు తాగుతూ నా పాటలు వింటారు అంటూ సినీ గాయకుడు అద్నాన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక సినీ  గాయకుడిగా నా పని  సంగీతంతో సంతోషపెట్టి ప్రేమను వ్యాప్తి చేయడమే అంటూ తెలిపాడు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించారు. అద్నాన్ సామీ  2016 లో భారత పౌరసత్వం పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: