కరోనా  వైరస్ ఈ పేరు వింటే చాలు ప్రపంచదేశాలన్నీ గడగడా వణికి పోతున్నాయి. ఎంతో మందిని పొట్టన పెట్టుకుని ఇంకెంతో మంది ని వ్యాధి బారిన పడేలా చేసి భయంతో బతికేలా చేస్తోంది కరోనా వైరస్ . చైనాలో మొదట వ్యాప్తి చెందిన ఈ వైరస్ ప్l ప్రపంచ దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. చైనాలో అయితే వేల సంఖ్యలోనే ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. వైరస్ బారిన పడకుండా మిగతా దేశాలు కూడా ఎన్నో ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి కరోనా  వైరస్ ఈ పేరు తలుచుకుంటేనే ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 ప్రాణాంతకమైన ఈ కరోనా వైరస్ చైనాలోని ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకోవడమే కాదు చైనాను ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. ఇది చైనా దేశంలోని పలు నగరాలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తుంది. దీంతో ఈ టి వైరస్ ఇతర దేశాల్లో కి  వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయా దేశాల అధికారులు. ఇక ఇప్పటికే పలు విమాన సంస్థలు చైనా విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు కూడా. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ స్వీడన్ కు చెందిన ఐకియా  కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోనే ఐకియా కు చెందిన 35 దుకాణాలలో సగం దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది ఐకియా. 

 

 

 చైనాలో కరోనా  వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వుహాన్ నగరంలోనే ఐకియా  దుకాణాన్ని కూడా ఇప్పటికే మూసివేసింది. కరోనా  వైరస్ వ్యాధి వ్యాప్తి సమర్థవంతంగా నియంత్రించేందుకు... చైనా ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో జనవరి 29 నుంచి తమకు సంబంధించిన దుకాణాలను సగం కు  పైగా ఐకియా మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కరోనా  వైరస్ బాధిత ఉద్యోగులు తదుపరి ప్రకటన వచ్చేంతవరకు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ తెలిపింది ఐకియా . ప్రస్తుతం చైనాలో 14 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది ఐకియా  సంస్థ. ఇకపోతే  ఇప్పటికీ చైనాలో వేగవంతంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ బారినపడి 132 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: