ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇక దేశ ప్రజలందరూ కరోణ వైరస్ ఎక్కడ తమ దేశానికి వచ్చి వ్యాప్తి చెందుతుందని బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా విమాన ప్రయాణికులు చైనా కు వెళ్లి వస్తే మాత్రం ఆ దేశ అధికారులు  ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వైద్య పరీక్షలు చేసిన అనంతరం దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఈ కరోనా  వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అలర్ట్ అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ దేశ పరిధిలోకి కరోనా వైరస్ రానివ్వకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు చేపడుతున్నాయి. 

 

 

 ఈ క్రమంలోనే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా  వైరస్ నుంచి తప్పించుకోవడానికి మామూలుగా అయితే ఎవరైనా మాస్కులు ధరించి జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా కరోనా  వైరస్ నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ ధరించాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైనాలోని షాంఘై నగరం నుంచి ఆస్ట్రేలియా పెర్త్  నగరానికి బుధవారం ఉదయం 9 గంటలకు ఓ విమానం వచ్చింది. విమానంలో  లో వచ్చిన ప్రతి ఒక్కరిలో కరోనా వైరస్ భయం కనిపించింది. విమానంలో వచ్చిన వారందరూ మూతి ముక్కు క్లినికల్ మాస్కు ధరించాలి. 

 

 

 ఇందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఏకంగా తలకు మోటార్ బైక్ హెల్మెట్ ధరించాడు . అయితే వారిని వెంటనే కిందకు దిగ ఇవ్వని ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వైద్య సిబ్బంది వచ్చి వారి చుట్టూ వైరస్ నాశనం స్ప్రే  చేసిన తర్వాత  విమానం కిందికి దింపారు. విమాన ప్రయాణంలో తన కొడుకు చిరాకుతో పలుమార్లు మాస్కులు తీసేందుకు ప్రయత్నించాడని.. అందుకే అలాంటి అవకాశం లేకుండా పక్కనే ఉండి  జాగ్రత్త పడ్డానని జూన్ వు  అనే వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం కరోనా  వైరస్ సోకి చైనాలో ఆరువేల మంది బాధపడుతుండగా.. ఆస్ట్రేలియాలో కూడా 16 మందికి కరోనా  వైరస్ సోకినట్లు అనుమానంతో వారికి ఆసుపత్రిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: