పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి . బడ్జెట్ సమావేశాలు అనగానే కేంద్ర ప్రభుత్వం దేనికి రాయితీ ఇస్తుంది .. దేనిపై  ధరలు పెంచుతుందన్న ఆసక్తి తో అందరూ  ఆసక్తిగా గమనించడం సహాజమే . కానీ ఈసారి ఏపీ ప్రజలు మాత్రం బడ్జెట్ సమావేశాలను మరింత తీక్షణంగా వీక్షించే అవకాశాలున్నాయి . దానికి కారణం లేకపోలేదు . ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం , దాన్ని ఆమోదించడం జరిగిపోయింది .

 

ఇక పార్లమెంట్ కు నివేదించడమే తరువాయి . అయితే శాసనమండలి రద్దు బిల్లు పార్లమెంట్ ముందుకు ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందే అవకాశం ఉందా ? లేదా ?? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా కొనసాగుతోంది . శాసనమండళ్ల ను ఏర్పాటు చేయాలని కోరుతూ  ఇప్పటికే ఓ నాలుగు రాష్ట్రాలు పార్లమెంట్ కు నివేదించి ఉన్న సమయం లో వాటి కంటే ముందు , ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి రద్దు బిల్లును పార్లమెంట్ చర్చించే అవకాశాలు ఎంతమాత్రం కన్పించడం లేదని పరిశీలకులు అంటున్నారు .

 

 వీలైనంత త్వరగా పార్లమెంట్ ఉభయ సభల ముందుకు మండలి రద్దు బిల్లును తీసుకురావాలని వైస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లాబీయింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు . అదే సమయం లో ఈ బిల్లు ను ఎంత ఆలస్యం అయితే అంత ఆలస్యం చేసే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది . చూడాలి మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో ?. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన బడ్జెట్ సమావేశాల్లోమాత్రం ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేవని పరిశీలకులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: