తెలంగాణ లో వరుస  ఎన్నికలు  జరుగుతూనే ఉన్నాయి . మొదట అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు.. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు... మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు... అన్ని ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. హమ్మయ్య ఎన్నికలు అన్ని అయిపోయాయి అనుకుంటున్నారా...అలా  అనుకుంటే పొరపాటు.. ఇంకొన్ని రోజుల్లో మళ్లీ తెలంగాణలో ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. మరి ఈసారి ఏం ఎన్నికలలో తెలుసా... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు. ఇంకొన్ని రోజుల్లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో  సహకార సంఘాల ఎన్నికల తో మరోసారి తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొననుండి. 

 

 

 అయితే నాలుగు రోజుల్లోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 15 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఎలాంటి జాప్యం జరగ కూడదు అంటూ కేసీఆర్ అధికారులకు ఆదేశాలు  జారీ చేశారు. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

 

 

 ప్రస్తుతం వ్యవసాయ సహకార సంఘాలకు ఉన్న ఇన్చార్జి పదవి కాలం ముగిసేలోపే... సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించాలి అంటూ ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు రావడంతో అధికారులు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. దీంతో మరోసారి తెలంగాణలో ఎన్నికల సందడి మొదలవ్వబోతుంది.  అయితే సహకార సంఘాల ఎన్నికలే  కదా ఇక్కడ ఏం పోటీ ఉండదు అనుకునేరు.. ఇక్కడ కూడా చాలానే  పోటీ ఉంటుంది.  సహకార సంఘాల ఇన్చార్జి పదవులకోసం ఎదురు చూస్తున్న ఆశావహులు ఎంతోమంది ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: